94 శాతం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేశాం

అగ్రిగోల్డ్‌ కేసులపై సీఐడీ దర్యాప్తు జరుగుతోంది

కేశవరెడ్డి బాధితులకు కూడా త్వరలోనే న్యాయం చేస్తాం

హోం మంత్రి మేకతోటి సుచరిత

అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 94 శాతం మందికి న్యాయం చేశామని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ అంశంపై ఆమె సభలో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల గోడు విన్నారు. అధికారంలోకి రాగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించారు. ఇప్పటికే బాధితులకు రూ.264 కోట్లు కేటాయించి 94 శాతం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమా చేశాం. రూ.20 వేల లోపు డిపాజిట్‌ ఉన్న లబ్ధిదారులకు దాదాపు 3 లక్షల మందికి త్వరలో చెల్లింపులు చేస్తాం. రూ,3,944 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. అన్ని కేసుల్లో ఛార్జీషీట్లు దాఖలు చేశాం. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో 10 వేల కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక బాధితులకు చిత్తశుద్ధితో న్యాయం చేశారు. బాధితుల తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అగ్రిగోల్డ్‌ కేసులపై సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. కోర్టు అనుమతితో  మిగిలిన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం. కేశవరెడ్డి బాధితులకు సంబంధించి ముద్దాయి నాగిరెడ్డి కేశవరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశాం. ఆయనపై 13 కేసులు నమోదు చేశారు. భూములు, వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నాం. రివిజన్‌ పిటిషన్‌ కోర్టులో ఉంది. కేశవరెడ్డి బాధితులకు కూడా త్వరలోనే న్యాయం చేస్తాం. 

Read Also: థ్యాంక్యూ సీఎం సార్‌   

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top