తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 35 రోజుల పాటు వైయస్ఆర్‌సీపీ సంస్ధాగత నిర్మాణ ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రసంగించిన వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి...ఏమన్నారంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్ధాగత నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. 35 రోజుల పాటు వైయస్ఆర్‌సీపీ సంస్ధాగత నిర్మాణ ప్రత్యేక కార్యక్రమం రూపొందించాం. పార్టీ అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయాలి. పార్టీ కమిటీలను బలంగా నిర్మించుకోవాలి. కమిటీలకు సంబంధించిన డేటా అంతా డిజిటలైజ్ చేయడం, ప్రతి కమిటీ సభ్యుడి డేటాను రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకు డిజిటలైజ్ చేసి ఒక గొడుగు కిందకు తీసుకువస్తున్నాం, ఇందుకు సంబంధించి కసరత్తు కూడా పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తయితే వైయస్ఆర్‌సీపీకి 16 లక్షల నుంచి 18 లక్షల సైన్యం సిద్దమవుతుంది. గ్రామస్ధాయి నుంచి కమిటీలలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఉత్సాహంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి. మీడియా, సోషల్ మీడియాను మనం విస్తృతంగా వినియోగించుకోవాలి. జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మీరు నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అన్ని విధాలుగా సహాయపడుతూ మీమీ బాధ్యతలు చిత్తశుద్దితో నెరవేర్చాలి. పార్టీ నిర్మాణంలో మీరంతా క్రియాశీలకంగా పనిచేయాలి. మీ పాత్ర కీలకంగా ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్రస్ధాయి అవగాహన కల్పించాలనే మీతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేశాం. ఈ కార్యక్రమంలో డిజిటల్ మేనేజర్లు, ఐటీ నిపుణులు, సోషల్ మీడియా ఇంఛార్జ్‌లు మీకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారి అధ్యక్షతన మన పార్టీ నిత్యం ప్రజలతోనే ప్రజలకొరకు ముందుకుసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజల కోసం తపించిన నాయకుడు జగన్ గారు, మంచిపాలన ఎలా ఉంటుందో చూపిన నాయకుడు ఆయన, కానీ ఈ రోజు ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతోంది తాము ఏం కోల్పోయామనేది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిత్యం ప్రజల తరుపున నిలబడడం, పోరాడడం అనేది మన వైయస్ఆర్‌సీపీకే దక్కుతుంది. కోటి సంతకాల ఉద్యమం అనేది ప్రజా ఉద్యమంగా మారిందంటే మన అందరి కష్టం, శ్రమ వల్లే. ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడలేదు అలాంటి కార్యక్రమం. ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా చేయగలిగాం. ఇలాంటి ఎన్నో ప్రజా ఉద్యమాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. మీరంతా కూడా ఈ 35 రోజుల పాటు పార్టీ సంస్ధాగత నిర్మాణాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, రాష్ట్ర కార్యదర్శులు చల్లా మధుసుధన్ రెడ్డి, పుత్తా ప్రతాప్, హర్షవర్ధన్, పుత్తా శివశంకర్, కందుల రవీంద్ర, వజ్ర భాస్కర్, లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం.మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పార్టీ సంస్ధాగత నిర్మాణం స్పెషల్ డ్రైవ్ పై అవగాహన కల్పించారు.