చంద్ర‌బాబును సీఎంగానే భరించకపోతున్నాం 

మీడియా స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌

తాడేపల్లి: చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని అవుతారని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడిపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని ప్రశ్నించారు.

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈరోజు తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు దేశానికి ఉప ప్రధాని కాబోతున్నారని ఎల్లో మీడియాతో వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. దీనికి వైయ‌స్‌ జగన్‌ బదులిస్తూ.. చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అని అన్నారు.

ఇక, అంతకుముందు.. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారని మరో మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ.. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో ఉన్నారని బదులిచ్చారు. అది మంచి విషమమేనని చెప్పారు. 

Back to Top