టీడీపీపై వ్యతిరేకత.. వైయ‌స్ఆర్‌సీపీలోకి ఎనిమిది కుటుంబాలు 

శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని గోరంట్ల మండల కేంద్రంలోని యర్రపల్లి గ్రామంలో జరిగిన ఘటన స్పష్టంగా చూపుతోంది. 2024 ఎన్నికల ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో విసుగెత్తిన ఎనిమిది కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.

ఈ సందర్భంగా  శ్రీ సత్యసాయి జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వారిని పార్టీ లోకి ఆహ్వానించారు. వారికి వైయ‌స్ఆర్‌సీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి చేర్చుకున్నారు. అనంత‌రం ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే టీడీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, పార్టీలో చేరిన కుటుంబాలకు హృదయపూర్వక స్వాగతం పలికారు.
 

Back to Top