వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు జెండా ఆవిష్కరణ 

 తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు (మార్చి 12) ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ‌ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.
 

Back to Top