థ్యాంక్యూ సీఎం సార్‌   

 పాదయాత్రలో అగ్రిగోల్డు బాధితులకు వైయస్‌ జగన్‌  ఇచ్చిన హామీ నెరవేర్చారు

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి

అసెంబ్లీ: అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చారని, బాధితుల తరఫున థ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ అంశంపై ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ గురించి మాట్లాడాలంటే ముందుగా గణేష్‌, శివాజీరావు గురించిమాట్లాడాలి. గణేష్‌ యాభై ఏళ్ల వ్యక్తి..టైలర్‌గా కుటుంబాన్ని నెట్టుకొచ్చే వారు. కూతురు పెళ్లి చేయాల్సిన వ్యక్తి. శివాజీరావు ఓ బట్టల షాపులో ఓ గుమస్తాగా పని చేసే వ్యక్తి. వీరిద్దరు కూడా అగ్రిగోల్డ్‌ సంస్థలో ఏజెంట్లు. అగ్రిగోల్డ్‌లో వీరు డిపాజిట్లు చేయించి కమీషన్‌ కోసం ఆశతో బతికిన మధ్య తరగతి కుటుంబ సభ్యులు. అగ్రిగోల్డు స్కామ్‌ కారణంగా నంద్యాలకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చాలా మంది రూ.10 వేల కంటే తక్కువగా డిపాజిట్‌ చేశారు. 1995లో అవ్వా వెంకట్రావ్‌ అగ్రిగోల్డ్‌ సంస్థను స్థాపించారు. ప్రజల వద్ద భూములు కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. 2015లో డిపాజిటర్లకు డబ్బులు చెల్లించక మోసం చేశారు. ఈ కంపెనీ 7 రాష్ట్రాల్లో వ్యాపారాలు చేశారు. దాదాపు 19 లక్షల 18 వేల 868 మంది డిపాజిటర్ల నుంచి రూ.6381 కోట్లను ఈ సంస్థ తీసుకుంది. ఏపీలో 11,58,497 డిపాజిటర్ల నుంచి రూ.3,950 కోట్లు డబ్బులు వసూలు చేశారు.ఈ సంస్థ మీద దాదాపుగా 16 కేసులు ఉన్నాయి. హైకోర్టులో 23 వేల ఎకరాలు అటాచ్‌మెంట్‌ చేసింది. ఈ రోజు ఆస్తుల విలువ రూ.30 వేల కోట్లు ఉంటుంది. ఈ కంపెనీ దివాళ తీయడానికి అగ్రిగోల్డ్‌ ఒక్కటే కారణమా? వేరే శక్తులు ఉన్నారా అన్నది అనుమానాలు ఉన్నాయి. టీడీపీ సభ్యులు ఈ చర్చను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి కళ్లు అగ్రిగోల్డ్‌ ఆస్తులపై పడింది. ఈ ఆస్తులను ఇప్పటికే టీడీపీ నేతలు కాజేశారు. అగ్రిగోల్డ్‌ సొత్తును కొట్టేసి ప్రజలను మోసం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారి వారి అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది.  హైకోర్టులో ఓ పిల్‌ దాఖలు చేశారు. 2017 నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అక్కడికి వచ్చి అగ్రిగోల్డ్‌ బాధితులు, కేశవరెడ్డి బాధితులను కూర్చోబెట్టి వంద రోజుల్లో మీ డబ్బులు మీకు చెల్లిస్తామని చెప్పి మోసం చేశారు. ఏడాదిన్నర కాలంలో ఆ సమస్యలు పరిష్కరించలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మరోసారి కొత్త నాటకానికి తెర తీశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు చెల్లిస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మా నాయకుడు వైయస్‌ జగన్‌ అగ్రిగోల్డ్‌ బాధితులు తమ గోడును వినిపిస్తే..ఒక మనసున్న నాయకుడిగా మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే  ఇచ్చిన హామీని అమలు చేశారు. ఇవాళ రూ.264 కోట్లు మంజూరు చేసి రూ.10 వేల డిపాజిటర్లకు డబ్బులు చెల్లించారు. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు కూడా త్వరలోనే చెల్లిస్తాం. అగ్రిగోల్డ్‌ బాధితులకు మేలు జరుగుతోంది. మా మేనిఫెస్టో పైనే ఉంటుంది..నేను విన్నాను..నేను ఉన్నాను..మాట తప్పకుండా ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నారు. చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు ఇ‌చ్చి ఉంటే  థ్యాంక్యూ సీఎం అని నుదిటిపై రాయించేవారు. ఇన్ని లక్షల కుటుంబాలకు న్యాయం చేసిన వ్యక్తిగా..మంచి మనసు ఉన్న సీఎం వైయస్‌ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్యూ సీఎం సార్‌ అంటూ బాధితుల తరఫున తెలుపుతున్నాను.

Read Also: అగ్రిగోల్డ్‌ బాధితులు కాదు..నారా వారి బాధితులు

Back to Top