చిన్నారికి అన్నప్రాసన..నామకరణం చేసిన వైయస్‌ జగన్‌

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత  వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి చిన్నారికి అన్న‌ప్ర‌సాన‌, నామ‌క‌ర‌ణం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నేత అనిల్‌ కుమార్‌, విజయలక్ష్మి దంపతులు తమ కుమారుడికి అన్నప్రాసన, నామకరణం చేయాలని కోరుతూ వైయస్‌ జగన్‌ను కలిశారు. దంపతుల కోరికను సానుకూలంగా స్వీకరించిన వైయస్‌ జగన్‌ చిన్నారిని చేతుల్లోకి ఎత్తుకుని లాలించి, ఆశీస్సులు అందజేశారు. అనంతరం తల్లిదండ్రుల అభిష్టం మేర‌కు వారి కుమారుడికి ప్రజ్వల్‌ కృష్ణ రాథోడ్‌ అనే పేరు పెట్టి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆప్యాయంగా లాలించడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

తమ కుమారుడికి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా అన్నప్రాసన, నామకరణం జరగడం జీవితాంతం మరిచిపోలేని అనుభూతి అని అనిల్‌ కుమార్‌, విజయలక్ష్మి దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారి నాయనమ్మ, తాతలు, వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి జెడ్పీటీసీ రమావతు భీమి బాయి, బంజారా సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణా నాయక్‌ పాల్గొని చిన్నారికి ఆశీస్సులు అందజేశారు. 

చిన్నారికి పేరు పెట్టిన వైయస్‌ జగన్‌

తాడేపల్లి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరంకు చెందిన డి. కాశీ–నాగేశ్వరి దంపతులు బుధవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు  వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని కలిశారు. తమ చిన్నారికి పేరు పెట్టాలని కోరగా, వైయస్‌ జగన్‌ ఆ చిన్నారిని చేతుల్లోకి ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దాడారు. అనంతరం ఆ పాపకు విజయమ్మ అనే పేరు పెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్ గారి ఆశీస్సులు తమ కుమార్తెకు జీవితాంతం తోడుంటాయని దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
వైయ‌స్ జగన్‌గారి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆయన ఫోటోతో కూడిన ఫ్రేమ్‌ను బహుమతిగా అందజేశారు. ఈ ఆత్మీయ సమావేశం వైయస్‌ జగన్‌ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రతిబింబించిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

Back to Top