రేపు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో మాజీ సీఎం వైయస్‌ భేటీ

కోటి మందికిపైగా సంతకాల పత్రాలను అందజేత

దీనికి ముందు ఉదయం 10 గంటలకు సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద 
జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపే కార్యక్రమం

తర్వాత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, సీనియర్‌ 
నాయకులతో భేటీ

ఈ సమావేశం తర్వాత లోక్‌భవన్‌కు వైయస్‌.జగన్‌
 

తాడేపల్లి: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా  ఎల్లుండి (డిసెంబర్‌ 18న)  వైయ‌స్ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో బేటీ కానున్నారు. పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు, తదితరులతో కలిసి ఆయన గవర్నర్‌కు కోటి సంతకాల పత్రాలను అందించనున్నారు.  

దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌. జ‌గ‌న్ గారు జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయ కర్తలు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు పాల్గొంటారు. దీని తర్వాత వీరితో వైయ‌స్ జ‌గ‌న్ గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్‌ నివాసం లోక్‌భవన్‌కు బయల్దేరి వెళ్తారు. 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి.

Back to Top