అగ్రిగోల్డ్‌ బాధితులు కాదు..నారా వారి బాధితులు

అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేయాలని నారా లోకేష్‌ ప్రయత్నం

బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు

త్వరలోనే రూ.20 వేల లోపు డిపాజిటర్లకు న్యాయం
 
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

అసెంబ్లీ: అగ్రిగోల్డ్‌ బాధితులు అనేకంటే..వారిని నారా వారి బాధితులు అనడం కరెక్ట్‌ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ చర్చలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు పాదయాత్రలో చూసిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వారిని ఆదుకుంటామని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1150 కోట్లు విడుదల చేశారని, రూ.10 వేల లోపు డిపాజిటర్లకు ఇప్పటికే చెల్లింపులు చేశామని చెప్పారు. త్వరలోనే రూ.20 వేల డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తామని చెప్పారు. అగ్రిగోల్డుకు సంబంధించి దాదాపు 20 లక్షల మందికి సంబంధించిన కన్నీటి గాధ. 1995లో స్థాపించిన అగ్రిగోల్డ్‌ సంస్థ...దీన్ని నారా వారి బాధితులు అనడం కరెక్ట్‌. పదేళ్ల కాలంలోనే దాదాపుగా రూ.33 వేల కోట్ల ఆస్తులకు ఎదిగింది. రాష్ట్రంలో బాధితులకు చెల్లించాల్సిన రూ.6700 కోట్లు మాత్రమే. ట్యాక్సీలతో కలిపితే రూ.8 వేల కోట్లు. రాజధాని ప్రాంతంలోనే 1600 ఎకరాల భూములు ఉన్నాయి. వీరు బాకీ తీర్చలేరా? ఆగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి ఇది పెద్ద కష్టమే కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అగ్రిగోల్డ్‌ భూములను కాజేసేందుకు నారా లోకేష్‌కు కన్నుపుట్టి దుర్భుద్ధి కలిగింది. ఐదేళ్లు ఆ సమస్యను పరిష్కరించలేదు. నారా వారు ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నం చేశారు. 400 మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ నాటి మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కుటుంబ రావు, మురళీమోహన్‌ రావు ఆస్తులు కాజేయాలని చూశారు. ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో వైయస్‌ జగన్‌ దృష్టికి అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య వచ్చింది. ఆ రోజే చెప్పారు..నేను ఉన్నాను. నేను విన్నానని మాట ఇచ్చారు. ఆ ఫలితమే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మా రాజశేఖరరెడ్డి రక్తం వైయస్‌ జగన్‌ అంటే నాకు అత్యంత ప్రేమ, నమ్మకం ఉంది. అగ్రిగోల్డు బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారి బకాయిలు తీర్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రూ.10 వేల డిపాజిట్‌దారులకు దాదాపు 3 లక్షల మందికి డబ్బులు చెల్లించాం. రూ.264 కోట్లు చెల్లించారు. త్వరలోనే రూ.20 వేల డిపాజిట్‌దారులకు కూడా చెల్లించబోతున్నాం. 

Read Also: ప్ర‌తి ప్రాజెక్టును చిత్త‌శుద్ధితో పూర్తి చేస్తాం

Back to Top