ప్ర‌తి ప్రాజెక్టును చిత్త‌శుద్ధితో పూర్తి చేస్తాం

* అసెంబ్లీలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి*

ఇన్ని వ‌ర్షాలు ప‌డినా రాయ‌ల‌సీమ ప్రాజెక్టులు నింపులేక‌పోతున్నామ‌ని చాలా సంద‌ర్భాల్లో ప్ర‌శ్నించా.  చంద్ర‌బాబు గ‌డిచిన అయిదేళ్లు ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో చిత్త‌శుద్ధిగా ప‌నిచేసి ఉంటే ఈనాడు రాయ‌ల‌సీమ‌కు ఈ దుస్థితి ఉండేది కాదు. కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచి.. డ్యామ్‌ల‌కు ఆర్ అండ్ ఆర్ 
ప్యాకేజీలు ఇచ్చి ఉంటే ప్రాజెక్టులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడేవి. కానీ చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు హ‌డావుడిగా ప‌నులు మొద‌లుపెట్టి చేతులు దులిపేసుకున్నాడు. గ‌తంలో తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన బాబు రాయ‌ల‌సీమ ప్రాజెక్టులను ప‌ట్టించుకున్న పాప‌నపోలేదు. 2004-14 మ‌ధ్య గండికోట‌కు 5036 కోట్లు, హంద్రీనీవాకు 6593 కోట్లు కేటాయిస్తే చంద్ర‌బాబు మాత్రం కనీసం రెండొంద‌ల కోట్లు కూడా కేటాయించ‌లేదు. కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచ‌క‌పోవ‌డంతో ప్రాజెక్టుల నిల్వ సామ‌ర్థ్యం భారీగా ప‌డిపోయింది. ఎప్ప‌టిక‌ప్ప‌డు ప్రాజెక్టుల స్థితిగ‌తుల‌ను ప‌ట్టించుకుంటే ఈ దుస్థితి ఉండేది కాదు.

ప్ర‌స్తుతం ప్రాజెక్టులకు ఉన్న‌ సామ‌ర్థ్యాన్ని ప‌రిశీలిస్తే.. 
ఘోర‌క‌ల్లు 12.44 TMCల నుంచి 8 TMCల‌కు ప‌డిపోయింది
గొల్ల‌ప‌ల్లి 1.91TMC - 1 TMC
మిడ్ 5 TMC -  3.5 TMC
చిత్రావ‌తి 10 TMC  - 6.8 TMC
గండికోట  26.85 TMC   - 12 TMC
పెన్నా అహోబిలం  11 TMC  - 3.38 TMC
బ్ర‌హ్మంసాగ‌ర్  17.93 TMC - 6.28 TMC
స‌ర్వ‌రాయ‌సాగ‌ర్  3 TMC   - 1 TMC
పైడిపాలెం 6 TMC - 5.44 TMC ల‌కు ప‌డిపోయాయి. 

క‌నీసం 50 రోజులు వ‌ర్షాలు కురిసినా ప్రాజెక్టులు నింపాల‌ని ఇంజినీర్ల ఆధ్వ‌ర్యంలో వ్యూహ ర‌చ‌న చేస్తున్నాం. మేం అధికారం చేప‌ట్టి కేవ‌లం ఆరు నెల‌లే అయ్యింది. రాబోయే జూన్ నాటికి ప్ర‌తి ప్రాజెక్టు నిల్వ సామ‌ర్థ్యాన్నిపెంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. 

పోతిరెడ్డిపాడుని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతాం
తెలుగుగంగ 11,500 క్యూసెక్కులు - 18,000 క్యూసెక్కులు
ఎస్ ఆర్‌బీసీ 21,000 క్యూసెక్కులు - 30,000 క్యూసెక్కులు
కేసీ కెనాల్   12,500క్యూసెక్కులు    -  35000 క్యూసెక్కులు
అవుకు ట‌న్నెల్ 20,000క్యూసెక్కులు  - 30,000క్యూసెక్కులు
గండికోట 20,000క్యూసెక్కులు   -  30,000 క్యూసెక్కులు
హెచ్ ఎన్ ఎస్ ఎస్ 2100 క్యూసెక్కులు -  6,000 క్యూసెక్కులు
తెలుగు గంగ మెయిన్ కెనాల్ టు వైఎస్సార్ క‌డ‌ప‌  3500Q  -  8000క్యూసెక్కులు
గండికోట టు సీబీఆర్ లిఫ్ట్    2000క్యూసెక్కులు టు 4000క్యూసెక్కులు
గండికోట టు జీఎన్ ఎస్ ఎస్ 4,000 క్యూసెక్కులు టు 6 క్యూసెక్కులు

Read Also: ప్రాజెక్టులపై మా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది

Back to Top