తాడేపల్లి: తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక పొట్టి శ్రీరాములు అని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ ట్వీట్ చేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడు. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.