మెడికల్ ఉద్యమానికి ఎన్నారైల మద్దతు

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నారై వింగ్

గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి

యూకేలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు

యూకేలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పుట్టినరోజు వేడుకల్లో నేతలు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన మెడికల్ కళాశాలల ఉద్యమానికి ఎన్నారైలు పూర్తి మద్దతు ఇస్తున్నారని పార్టీ ఎన్నారై విభాగం స్పష్టం చేసింది. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం యూకేలో ఘనంగా నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ యూకే విభాగం ఆధ్వర్యంలో కోవెంట్రీ నగరంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ పార్టీ ఎన్ఆన్ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. రానున్న మూడేళ్లలో పార్టీ కోసం ఏవిధంగా పనిచేయాలనే విషయంపై యూకేలోని పార్టీ యూత్ వింగ్ కు దిశా నిర్దేశం చేశారు. 18 నెలల పాలనలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ (ఎన్నారై అఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. కొత్త మెడికల్ కాలేజీల్లో పదింటిని గంపగుత్తగా ప్రైవేటుపరం చేస్తూ సీఎం చంద్రబాబు దానికి ముద్దుగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) అని పేరుపెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ యూత్ కోవెంట్రీ విభాగం నేతలు గ్రీష్మంత్, పుష్పేంద్ర, అమర్, హరీష్, లోహిత్, నిరంజన్ యూకే కన్వీనర్ ఓబుల్ రెడ్డి పాతకోట, యూఎస్ఏ కన్వీనర్ శివ అన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top