చంద్రబాబు ఆర్థిక విధ్వంసం.. కాగ్‌ నివేదికే సాక్ష్యం 

మీడియా స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ్వ‌జం

రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయి

నేను చెప్పిన విషయాలనే కాగ్‌ రిపోర్టు చెప్పింది

2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు 

2023-2024లో రాబడులు రూ.1,70,767 కోట్లు 

 చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు 

చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే 

చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు 

 తాడేపల్లి: చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ..  చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు. 

 
 ఇది మూడో బ‌డ్జెట్‌..
రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు గారి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత.. ఆయ‌న‌కు మామూలుగా 5 బ‌డ్జెట్లు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ప్ర‌జ‌లు ఇస్తారు. అలాంటిది మూడో బ‌డ్జెట్ కూడా తాను ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో అంటే ఇంక మిగిలి ఉండేది ఇంక రెండే రెండు బ‌డ్జెట్లు ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం. మెజారిటీ ఆఫ్ ది టైమ్ అయిపోయి ఉన్న ప‌రిస్థితులు. ఆ బ‌డ్జెట్ కూడా ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత అసెంబ్లీ స‌మావేశాలు కూడా దాదాపుగా 16 రోజులు దీనిమీద చ‌ర్చ జ‌రిగిన పిమ్మ‌ట‌.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏదైనా దాని వ‌ల్ల మంచి జ‌రిగిందా అన్న‌ది ఒక్క‌సారి ఆలోచ‌న చేస్తే 16 రోజుల అసెంబ్లీ స‌మావేశాలు సైతం చంద్ర‌బాబు గారు తాను పెట్టిన బ‌డ్జెట్ మీద‌, మోసాలు, క‌ల్పిత లెక్క‌లు, అబ‌ద్ధాలు.. ఇవి మాత్ర‌మే క‌నిపించాయి త‌ప్ప ప్ర‌జ‌ల‌కు మేలు అయితే ఒక పెద్ద సున్నా.

ఇన్ ఫ్యాక్ట్ ప్ర‌జ‌ల్ని ఎలా త‌ప్పు ప‌ట్టిస్తున్నాడు అన్న విష‌యంపై నేను గ‌త నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా స‌వివ‌రంగా కూడా చెప్పాను. మొద‌టి బ‌డ్జెట్ లో తాను ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడే అయ్యా చంద్ర‌బాబు గారూ వీటికి సంబంధించిన స‌మాధానాలు ఉన్నాయా అని అడ‌గ‌డం జ‌రిగింది. 

ఇప్పుడు చివ‌రికి కాగ్ రిపోర్టు కూడా చంద్ర‌బాబు నాయుడు గారిని, ఆరోజు నేనేదైతే వివ‌రాలు చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూడీ చేస్తూ చంద్ర‌బాబు నాయుడు గారి కూట‌మి చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు కాగ్ నివేదిక కూడా చెప్పింది. 

చంద్ర‌బాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్న‌దానికి కొన్ని ఎగ్జామ్ పుల్స్ మీ అంద‌రి దృష్టికి తీసుకొస్తున్నా. మా ప్ర‌భుత్వం చివ‌రి ఏడాది 2023-24ను ఆయ‌న తొలి ఏడాది ఏదైతే కాగ్ రిపోర్టులు పబ్లిష్ చేసిందో ఒక్క‌సారి పోలిస్తే చాలా స్ప‌ష్టంగా కొన్ని కొన్ని విష‌యాలు క‌నిపిస్తాయి. 2023-24లో ప్ర‌భుత్వం నుంచి చేసిన ఖ‌ర్చు ఎంత అని చూస్తే రూ.2,36,486 కోట్లు. ఆ సంవ‌త్స‌రం ప్ర‌భుత్వానికి వ‌చ్చిన రాబ‌డులు అంటే అన్ని ర‌కాల రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన వ‌న‌రులు అంటే ఒక్క అప్పులు త‌ప్ప‌.. రాష్ట్రానికి వ‌చ్చే సొంత ప‌న్నుల ఆదాయం, పన్నేత‌ర ఆదాయాలు, కేంద్ర ప్ర‌భుత్వం వివిధ రాష్ట్రాల‌కిచ్చే వాటా డెవ‌ల్యూష‌న్స్, గ్రాంట్ఇన్ ఎయిడ్ అన్నీ క‌లుపుకుంటే రూ.1,73,767 కోట్లు. 

మా ప్ర‌భుత్వం చివ‌రి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,683 కోట్లు, ద్ర‌వ్య లోటు అంటే ఫిస్క‌ల్ డెఫిషిట్ అంటే అప్పులు 2023-24లో చేసిన‌వి 62,720 కోట్లు కూడా మీ కంటికి క‌నిపిస్తుంది. ఒక‌సారి గ‌మ‌నించ‌మ‌ని అడుగుతున్నా. 

ఈ రెవెన్యూ లోటు, ద్ర‌వ్య‌లోటు అంటే అప్పులు చంద్ర‌బాబు గారి కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎంత దారుణంగా పెరిగాయో చూడండి. 2024-25లో రాష్ట్ర క‌న్సాలిటేటెడ్ ఫండ్ నుంచి చేసిన ఖ‌ర్చు 2,49,096 కోట్లు. చంద్ర‌బాబుగారి మొద‌టి ఏడాది చేసిన ఖ‌ర్చు. 

కానీ ఆ సంవ‌త్స‌రంలో రాష్ట్రానికి వ‌చ్చిన అన్ని ర‌కాల రాబ‌డులు చూస్తే.. కేవ‌లం 1,68,024 కోట్లు. అదే మీరు గ‌మ‌నిస్తే మా హ‌యాంలో 2023-24లో రూ.1,73,767 కోట్లు. ఇంకా గ‌మ‌నిస్తే 2024-25 మొద‌టి ఏడాది చూస్తే రెవెన్యూలోటు ఏకంగా 60,285 కోట్లు. వ‌ర్సెస్ మా ప్ర‌భుత్వ హ‌యాంలో మా చివ‌రి ఏడాది కూడా రెవెన్యూ లోటు 38,683 కోట్లు మాత్ర‌మే. 

ఆయ‌న హ‌యాంలో రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్ల‌కు ఎగ‌బాకింది. ఇక 2023-24లో అంటే మా ప్ర‌భుత్వ హ‌యాంలో ఫిస్క‌ల్ డెఫిషిట్ అంటే అప్పులు మేం చేసింది ఎంత అని చూస్తే 60,285 కోట్లుగా క‌నిపిస్తుంది. 

అదే చంద్ర‌బాబు నాయుడు గారి హ‌యాంకు వ‌చ్చే స‌రికే 2024-25కు వ‌చ్చే స‌రికే ఏకంగా 81,071 కోట్లు క‌నిపిస్తుంది. అంటే చంద్ర‌బాబు నాయుడు గారి హ‌యాంకు, మ‌న హ‌యాంకు తేడా చూస్తే చంద్ర‌బాబు గారి మొద‌టి ఏడాది రాష్ట్రానికి రాబ‌డులు త‌గ్గాయి. ఇంత‌కు ముందు మాహ‌యాంలో 1,73,767 కోట్లు ఉండేది చంద్ర‌బాబు హ‌యాంకు వ‌చ్చే స‌రికే 1,68,024 కోట్లు. రెవెన్యూ డెఫిషిట్ ఏకంగా 56 శాతం పెరిగింది. 38,683 కోట్లు మా హ‌యాంలో ఉంటే ఏకంగా 60,285 కోట్లు ఆయ‌న హ‌యాంలో. 

ఇక ఫిస్క‌ల్ డెఫిషిట్ అంటే ద్ర‌వ్య‌లోటు చూస్తే మా హ‌యాంలో చేసిన అప్పులు 60,285 కోట్లు అయితే, ఆయ‌న హ‌యాంలో ఏకంగా 81,071కోట్లు. అంటే ఏకంగా 30 శాతం పెరిగింది. అయినా స‌రే చంద్ర‌బాబు నాయుడు గారి మొద‌టి ఏడాది చూస్తే ఎక్క‌డా కూడా సూప‌ర్ సిక్సులు లేవు, సూప‌ర్ సెవెన్లూ లేవు. పైగా మా హ‌యాంలో ఉన్న పాత స్కీముల‌న్నీ ర‌ద్దు చేశారు. ఆ స్కీములూ లేవు. 

అయినా చంద్ర‌బాబు హ‌యాంలో ఇంత‌టి దారుణ‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఒక‌సారి గ‌మ‌నించ‌మ‌ని అడుగుతున్నా. 2024-25 త‌ర్వాత కూడా ద్ర‌వ్య‌లోటు, ఫిస్క‌ల్ డెఫిషిట్.. చంద్ర‌బాబు గారు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు. ఒక‌సారి గ‌మ‌నిస్తే 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం మా ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డ నుంచి గ‌మ‌నిస్తే 2025-26 దాకా..  మా ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వంలో ద్ర‌వ్యలోటు అప్పులు ప‌ర్సెంటేజ్ ఆఫ్ టోట‌ల్ ఎక్స్ పెండిచ‌ర్ చూస్తే.. మా 5 సంవ‌త్స‌రాల హ‌యాంలో ఎంత త‌క్కువ‌గా ఉందో, అదే చంద్ర‌బాబు గారి హ‌యాంలో అప్పులు ప‌ర్సెంటేజ్ ఆఫ్ టోట‌ల్ ఎక్స్ పెండించ‌ర్ ఎంత ఎక్కువ‌గా ఉందో తెలుస్తుంది. 

మా హ‌యాంలో ఇంకా కోవిడ్ లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొన్నాం. పైగా అటువంటి ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ కూడా పైగా క్ర‌మం త‌ప్ప‌కుండా మేము ఇచ్చిన‌మాట‌ల‌న్నీ కూడా నెర‌వేర్చుకుంటూ మ్యానిఫెస్టో అమ‌లు చేశాం. అలాంటి క్ర‌మ‌శిక్ష‌ణ చూపించిన ప‌రిస్థితులు కూడా మాలో ఉన్నాయి. 

ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా ఒక్క‌సారి గ‌మ‌నిస్తే ఏ ర‌కంగా అప్పులు ఆజ్ ఎ ప‌ర్సెంటేజ్ ఆఫ్ టోట‌ల్ ఎక్స్ పెండిచ‌ర్ చూస్తే.. ఏర‌కంగా 2019-20లో 25.59 శాతం, 2020-21 కోవిడ్ స‌మ‌యంలో కాస్త పెరిగింది 31.82కు వ‌చ్చింది. త‌ర్వాత మ‌ళ్లీ ఫిస్క‌ల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం. 2021-22లో ఏకంగా 14.08 శాతానికి త‌గ్గించాం. 2022-23లో కూడా 24.97 శాతం, 2023-24 చివ‌రి సంవ‌త్స‌రంలో కూడా మా ఫిస్క‌ల్ డెఫిషిట్ ఆజ్ ఎ ప‌ర్సెంటేజ్ ఆఫ్ టోట‌ల్ ఎక్స్ పెండి చ‌ర్ చూస్తే 26.62 శాతం. అదే చంద్ర‌బాబు గారి హ‌యాం చూస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములూ లేక‌పోయినా, సూపర్ సిక్స్, సూప‌ర్ సెవెన్ లాంటి ప‌థ‌కాలేమీ లేక‌పోయినా, గ‌తంలో మా పథ‌కాల‌న్నీ ర‌ద్దు చేసినా ఏకంగా ఫిస్క‌ల్ డెఫిషిట్ ఆస్ ఎ ప‌ర్సెంటేజ్ ఆఫ్ టోట‌ల్ ఎక్స్ పెండించ‌ర్ 2024-25లో 32.55 శాతానికి పెరిగింది. 

ఇంకా ఈ సంవ‌త్స‌రం 2025-26 మొద‌టి 10 నెల‌లు తీసుకుంటే అక్క‌డ కూడా అప్పులు ఆజ్ ఎ ప‌ర్సెంటేజ్ ఆఫ్ టోట‌ల్ ఎక్సెండిచ‌ర్ చూస్తే 39.74 శాతానికి ఎగ‌బాకింది. నిజంగా చంద్ర‌బాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవ‌న్నీ కూడా చిత్ర‌ప‌టాలు, సాక్ష్యాలు,ఆధారాలు.

అంతే కాకుండా 2024-25 సంవ‌త్స‌రంలో జీఎస్డీపీలో ఫిస్క‌ల్ డెఫిషిట్ కాంపొనెంట్.. అంటే జీఎస్డీపీలో తీసుకొచ్చిన అప్పుల శాతం ఏకంగా 5.08 శాతం. మా హ‌యాం చూస్తే ఐదేళ్ల పాటు చూసినా కూడా జీఎస్డీపీలో ఫిస్క‌ల్ డెఫిషిట్ అంటే అప్పుల‌కు సంబంధించిన ప‌ర్సెంటేజ్ ఎంత అంటే స‌గ‌టున 4.11 శాతం.

ఇంకా మా హ‌యాంలో కోవిడ్ ఉంది. అనుకోని ఖ‌ర్చులు పెరిగాయి. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు. ప్ల‌స్ తుచ త‌ప్ప‌కుండా మేనిఫెస్టోను కూడా అమ‌లు చేశాం. అయినా కూడా జీఎస్డీపీలో ఆజ్ ఎ ప‌ర్సెంటేజ్ ఆఫ్ ఫిస్క‌ల్ డెఫిషిట్ మా ఐదేళ్ల పీరియ‌డ్ లో స‌గ‌టున మాది 4.11 శాతం ఉంటే ఈయ‌న 2024-25 మొద‌టి ఏడాది ఏకంగా 5.08 శాతం దాటేశాడు. 

రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను న‌డిపించే విష‌యంలో చంద్ర‌బాబు గారి విధ్వంస‌పు రికార్డుకు ఇవి నిజంగా చిత్ర‌ప‌టాలుగా నిల‌బ‌డ‌తాయి. మామూలుగా ఏ రాష్ట్ర‌మైనా కూడా ఎన్బీసీ (నెట్ బారోయింగ్ సీలింగ్)కి లోబ‌డి అప్పులు తీసుకోవాలి. కానీ చంద్ర‌బాబు ప్ర‌తిసారీ దీన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఒక‌వైపున ఉల్లంఘిస్తాడు, మ‌రోవైపున బిల్డ‌ప్ మాత్రం ఇస్తాడు. తాను గొప్ప ప‌రిపాల‌న ద‌క్షుడిగా బిల్డ‌ప్ ఇస్తాడు. వాస్త‌వాలు చూస్తే 2014 నుంచి 2019 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఎన్బీసీ అనుమ‌తించిన దానిక‌న్నా కూడా ఆ ఐదేళ్ల‌లో రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడాయ‌న‌. 

అదే మా హ‌యాంలో 2019-24 చూస్తే రెండేళ్ల పాటు మాకు కోవిడ్ ఉన్నా కూడా, దీని వ‌ల్ల ఆదాయాలు త‌గ్గినా కూడా ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌డం కోసం ఎమ‌ర్జెన్సీ సేవ‌ల రూపేణా భారీగా ఖ‌ర్చులు పెట్టే ప‌రిస్థితులు ఉన్నా కూడా ఇవ‌న్నీ ఉన్నా కూడా ఇచ్చిన హామీల‌న్నీ కూడా నెర‌వేరుస్తూ అమ‌లు చేసినా కూడా మేము ఎన్బీసీ ప‌రిమితిక‌న్నా రూ.12,707 కోట్లు త‌క్కువ‌గానే అప్పులు చేశాం. మా ఐదేళ్ల ట్రాక్ రికార్డు. 

చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రాగానే మ‌ళ్లీ సీన్ రివ‌ర్స్ ఫిస్క‌ల్ డిసిప్ల‌న్ అన్న‌ది గాలికి ఎగిరిపోయింది. మ‌ళ్లీ సీన్ రివ‌ర్స్. తాను అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి ఏడాది 2024-25లో ఎన్బీసీ ప‌రిమితికి మించి ఏకంగా రూ.17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడు. 

ఇక 2025-26లో ప‌రిస్థితి చూస్తే ఇంత‌క‌న్నా ఘోరంగా ఉంది. ఈ రెండేళ్ల‌లో చంద్ర‌బాబు తెచ్చిన అప్పులు ఒక‌సారి గ‌మ‌నిస్తే చంద్ర‌బాబు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు.. వీటి గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే రూ.3 ల‌క్ష‌ల 20 వేల కోట్లు దాటాయి ఇప్ప‌టికే. 

మా ఐదేళ్ల పీరియ‌డ్ లో కూడా మేం తీసుకొచ్చిన అప్పులు రూ.3.31 ల‌క్ష‌ల కోట్లు అయితే, ఈయ‌న తీసుకొచ్చిన అప్పులు, ఈయ‌న కాంట్రాక్టెడ్ అప్పులు, గ్రాస్ గా చూస్తే రూ.3,20 ల‌క్ష‌ల కోట్లు దాటాయి. ఏమేం కార్పొరేష‌న్ల నుంచి ఎంతెంత అప్పులు తాను కాంట్రాక్ట్ చేశాడు, ఎంతెంత అప్పులు తీసుకొచ్చాడు, అన్నీ కూడా ఈ టేబుల్లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింది. వీట‌న్నింటికీ కూడా జీవోలు కూడా ఉన్నాయి.

Back to Top