జగ్గయ్యపేటలో  ఘనంగా మే డే వేడుకలు 

 జగ్గయ్యపేట:  జగ్గయ్యపేట నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్-ఛార్జ్ త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎప్పటికప్పుడు పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన విశిష్ట కార్మికులను గుర్తించి వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల సేవలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షుడు బూడిద నరసింహారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శ్యామల్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రాష్ట్ర చేనేత విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ పెంటి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, పట్టణ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఉసా సురేష్, నియోజకవర్గ ఎంప్లాయిస్ యూనియన్ విభాగ అధ్యక్షుడు దర్శి వెంకటేశ్వర్లు, మండల ప్రచార విభాగ అధ్యక్షుడు ఏశాల కనకచందర్రావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, వార్డు అధ్యక్షుడు ఉప్పెల్లి పెంటయ్య తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 

Back to Top