ఏలూరు జిల్లాలో ఘనంగా మే డే వేడుకలు 

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో నగర అధ్యక్షులు గంటా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్, జిల్లా వైయస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పల్లి శ్రీనివాసరావు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కృషి సమాజ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. వారి సంక్షేమం కోసం వైయ‌స్ జ‌గ‌న్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదీసి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) కైకలూరు నియోజకవర్గ పరిశీలకులు నూకపేయ్యి సుధీర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి మున్నాల జాన్ గుర్నాథ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నిరసన చిరంజీవి, బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షురాలు బోగిశెట్టి పార్వతి, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షులు స్టాలిన్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తోమరాడ స్రవంతి, రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి డాక్టర్ షేక్ బాజీ (గాజుల బాజీ), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి భాస్కర్ల బచ్చి, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి లోటుకుర్తి సుభాష్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, నగర కల్చరల్ విభాగం అధ్యక్షులు మేతర సురేష్, నగర బూత్ కమిటీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా కార్యదర్శి కే జనార్దన్, సాస్పల్లి యుగంధర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసి, జిల్లా సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్ కుమార్ తదితరులు, కార్మిక సోదరులు పాల్గొన్నారు.

Back to Top