ఘ‌నంగా వై.వి. సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు

మేద‌ర‌మెట్ల‌లో వైద్య శిబిరం ఏర్పాటు

అద్దంకి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు మేదరమెట్లలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్ట‌ర్ చింత‌ల‌పూడి అశోక్ కుమార్ పాల్గొని సుబ్బారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య డాక్టర్ అశోక్ కుమార్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. సుబ్బారెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి, ప్రజా సేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆయన ఆకాంక్షించారు.

జన్మదినం పురస్కరించుకుని ప్రజల సౌకర్యార్థం మేదరమెట్లలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ అశోక్ కుమార్ ప్రారంభించారు. స్వతహాగా వైద్యుడైన ఆయన, క్యాంప్‌కు వచ్చిన రోగులను స్వయంగా పరీక్షించి పలు వైద్య సూచనలు అందించారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడం ద్వారా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ హాస్పిటల్ చైర్మన్ రామలింగేశ్వరరావు, వైద్య శిబిరంలో సేవలందించిన వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
 

Back to Top