తిరువూరులో ఘనంగా మే డే వేడుకలు  

ఎన్టీఆర్ జిల్లా:  తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.  తిరువూరులోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ హాజరై వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల కృషి దేశ అభివృద్ధికి పునాది అని కొనియాడారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రేగళ్ళ మోహన్ రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి పరసా శ్రీనివాసరావు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి జక్కుల కృష్ణ, జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మెరుగు రంజిత్ కుమార్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కలసాని గోపాల నాగేశ్వరరావు, రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి బొల్లెపోగు కొండలరావు, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పరసా నెహ్రూ, జిల్లా ముస్లిం మైనారిటీ కార్యదర్శి షేక్ రాజ్ మహమ్మద్, నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షుడు సోమవారపు మల్లికార్జునరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడి కుటుంబరావు, పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బండి అంజన్ కుమార్, ఎక్కిరాల అర్జునరావు, షేక్ వాహాబ్, పినపాటి వెంకటేశ్వరరావు, మంచాల మల్లేశ్వరరావు, ముళ్ళపాటి దేవ కుమార్ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Back to Top