ఒంగోలు: వైయస్ఆర్‌సీపీ ఒంగోలు పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి, రాష్ట్ర కార్యదర్శులు కె.వి. రమణా రెడ్డి, వై వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్ తదితరులు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ వైవీ సుబ్బారెడ్డి పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన నాయకత్వం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చిత్తశుద్ధి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.