మహానాడు కాదు.. మాయనాడు 

ప్రజలను భ్రమల్లో ముంచెత్తే ప్రచార కార్యక్రమమే  

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఫైర్‌

 నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడు ప్రజలను భ్రమల్లో ముంచెత్తే "మాయనాడు"గా మారిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విమర్శించారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే మహానాడు ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహానాడులో టీడీపీ నాయకులు తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పుకోలేక, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారని అన్నారు. ప్రజల కళ్లకు పొరలు కమ్మేలా ప్రచార ఆర్భాటాలతో మహానాడును నిర్వహించారని విమర్శించారు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో తప్పు లేదని, అయితే కేవలం ప్రచారం కోసమే ప్రజాధనాన్ని భారీగా ఖర్చు చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. మహానాడు కార్యక్రమంతో పాటు టీడీపీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. మహిళలకు సరైన రక్షణ కల్పించలేని ప్రభుత్వం మహానాడు వేదికపై మహిళా సాధికారత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాకాణి పూజిత ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని, సభకు మహిళలను బలవంతంగా తరలించారని కూడా ఆమె విమర్శించారు. 

Back to Top