వచ్చే ఎన్నికలు మావిగన్‌ Vs అమరావతి

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ 

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌.. మావిగన్‌ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్‌కు మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికలు మావిగన్‌ వర్సెస్‌ అమరావతి. ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తుంది. అవినీతి జరగకుండా మావిగన్‌ రాజధాని వస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు. 
వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘నేను అమరావతి వెళ్తే.. జగన్‌ అమరావతికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి నేను వ్యతిరేకం. అక్కడ ఉన్న రైతుల ఆవేదనను నేను చెబుతున్నాను. చంద్రబాబు అమరావతిలో చేస్తున్న స్కాంలను ప్రశ్నిస్తున్నా. అవినీతి లేని రాజధాని కావాలనేదే చెబుతున్నా. మావిగన్‌కు మద్దతు ఇచ్చే వారు వైయ‌స్ఆర్‌సీపీకి ఓటు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్‌ను వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో చేరుస్తాం. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో స్పష్టమవుతుంది. రైతులు తరఫున నేను ప్రశ్నస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.  

బీచ్‌ షాక్స్‌ పేరుతో మద్యం అమ్ముతారా? 
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం, లాకప్‌ డెత్‌లు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జగన్‌ ఆరోపించారు. "చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?" అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్‌ విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, అవినీతి, దోపిడీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. "రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం లేదు. కానీ దోచుకున్న సొమ్ము మాత్రం విదేశాలకు వెళ్తోంది" అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైయ‌స్‌ జగన్‌ ధ్వజమెత్తారు.
 

Back to Top