పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని  జూపూడి ప్రభాకర రావు ప‌రామ‌ర్శ‌

విజయవాడ : ఇటీవల విజయవాడలోని కృష్ణలంక పోలీసుల వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి మృతి చెందిన ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు  పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు పరామర్శించారు.

ఈ సందర్భంగా పేరుపోగు క్రాంతి కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జూపూడి ప్రభాకర రావు గారు, పేరుపోగు వెంకటేశ్వరరావు గారితో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునేలా మనోధైర్యంతో ఉండాలని వారికి ఓదార్పునిచ్చారు.  కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాల మహానాడు ప్రధాన కార్యదర్శి దాసి కెనడీ, ఎంఆర్పీఎస్ నాయకులు సురేష్, దాసరి జిన్నీ, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రేవ. దాదాల గిరి, గగరీన్, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top