హిందూపురంలో టీడీపీ, జనసేనకు షాక్.. 

వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన పలువురు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు 

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పలువురు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలువైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్  టీఎన్ దీపిక వేణు సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

లేపాక్షి మండల కన్వీనర్  సయ్యద్ నిస్సార్ , పార్టీ సీనియర్ నాయకులు శేషాద్రి రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, విజయ్ కుమార్, తిప్పన్న, నరసింహమూర్తి ఆధ్వర్యంలో నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన  జయకృష్ణ, నరసింహ, మూర్తి, ప్రవీణ్, శివకుమార్, మధుసూదన్, నారాయణస్వామి, లోకేష్, శివన్న, గోపీనాథ్, నవీన్ కుమార్, సాయి గంగాధర్ తదితరులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా టీఎన్ దీపిక వేణు మాట్లాడుతూ, వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు, యువత పెద్దఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, బాధ్యతలు కల్పిస్తూ ప్రజల మధ్య కలిసి పనిచేస్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కురుబ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఏ. శివ , జిల్లా కార్యదర్శి  కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ రామాంజి, నాయనపల్లి పంచాయతీ కమిటీ ఉపాధ్యక్షుడు బాబు, పార్టీ నాయకులు కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top