కనిగిరి: పొగాకు రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం జిల్లా కనిగిరిలో నిర్వహించిన పొగాకు రైతు దీక్షకు వైయస్ఆర్‌సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, వైఎస్ జగన్ హయాంలో రైతులకు భరోసా ఉండేదని, ప్రస్తుతం రైతులు తీవ్ర నష్టాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారని నాయకులు మండిపడ్డారు. రైతులకు తక్షణమే గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాల్గొని రైతులకు మద్ధతు ప్రకటించిన ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వర రావు, జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రివర్యులు, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగు నాగార్జున, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి, మరియు ఇతర పార్టీ నేతలు. కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన రైతులు, వైయస్సార్సీపీ నేతలు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే... ● బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ - పొగాకు రైతుల కష్టాలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత పొగాకు రైతులకు అండగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి రైతుకు, ప్రతి మహిళకు నా కృతజ్ఞతలు. వైయస్. జగన్ హయాంలో రైతులు సంతోషంగా పొగాకు అమ్ముకుని గౌరవంగా జీవించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో రైతు కుటుంబాల్లో ఆనందం కాదు... కన్నీళ్లు, ఆవేదనే మిగిలాయి. పొగాకు రైతులు అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి పంట పండిస్తున్నారు. పొగాకు బోర్డు, కొనుగోలు సంస్థలు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. రైతు శ్రమకు తగిన గౌరవం, గిట్టుబాటు ధర ఎక్కడా కనిపించడం లేదు. వైయస్. జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, పంట నష్టపరిహారం రైతులకు అండగా నిలిచాయి. నేడు పంట నష్టపోయినా రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదు. రైతుల బాధ, ఆవేదన కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడుతుంది. రాబోయే ఎన్నికల్లో రైతులే కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ● కూటమి ప్రభుత్వం మేలుకొని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి - పులి శాంతి, కనిగిరి మున్సిపాల్టీ మాజీ వైస్ చైర్ పర్సన్. కనిగిరి చాలా వెనుకబడిన ప్రాంతం. వర్షాలు చాలా తక్కువ కాబట్టి కొద్దో, గొప్పో వాళ్లు పొగాకు పండించుకుంటున్నారు. ఇవాళ ఒక బేలు రూ.16 వేలకు కొంటున్నారు. అదే వైయస్. జగన్ హయాంలో బేలు ధర రూ. 36వేలు వరకూ పలికింది. ఆ రోజు రైతు భరోసా కేంద్రాలు పెట్టి సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ఏకైక ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే వైయస్. జగన్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచారు. యూరియా, విత్తనాలు సహా ఎక్కడా, దేనికీ రైతులు ఇబ్బంది పడకూడదు, వారికి గిట్టుబాటు ధర అందాలి అని ఆలోచించింది వైయస్.జగన్ మాత్రమే. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వాళ్లు ఇచ్చిన హామీలు వేటినీ నిలబెట్టుకోలేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వర్గానికిచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. కనిగిరి ప్రాంత ప్రజలకి అలాగే ప్రకాశం జిల్లా రైతులు ఎక్కువ మంది పొగాకు మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మేలుకొని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం. ● వై. వెంకటరెడ్డి - రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి - చంద్రబాబు పాలనలో మోసపోతున్న రైతులు - గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులు వైయస్.జగన్ ఆదేశాల మేరకు పొగాకు రైతులకు మద్ధతుగా ఇవాళ వైయస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈరోజు సమస్య ఒక పొగాకు రైతులకే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉంది.కనిగిరి ఏరియాలో రైతులు పొగాకు బాగా పండిస్తారు. మళ్లీ పొగాకు సీజన్ స్టార్ట్ అయిపోయి ఖరీఫ్ సీజన్ అయిపోయే పరిస్థితి వచ్చినా ఈరోజు కూడా పొగాకు అమ్ముకోలేని పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో దాపురించారు. అలా అయితే రైతులు మళ్లీ ఏ పంట వేసుకోవాలి? మళ్లీ ఎలా బతకాలి?చంద్రబాబు నాయుడుకి రైతులు అంటే చాలా చిన్న చూపు. చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించి లక్ష కోట్లకు వెళ్లాడు . కానీ ఆయన అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు 50 ఎకరాల రైతు కూడా రెండు ఎకరాలకు వచ్చాడు. ఇదంతా మనందరం గమనించాలి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మోసపూరిత మాటలు చెప్పడం, ముఖ్యమంత్రి కావడము అలవాటుగా మారింది. ఎన్నికల ముందు అన్నీ ఇస్తాను అనడము గెలిచిన తర్వాత అన్నీ ఎగ్గొట్టడము ఇదంతా వెన్నుపోటు కార్యక్రమం. రాబోయే రోజుల్లో వైయస్. జగన్ ని ముఖ్యమంత్రిని చేసుకున్నట్లయితే రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. రైతే రాజుగా మారుతాడు. 2019 నుంచి 2024 వరకు వైయస్. జగన్గవర్నమెంట్‌లో ఏ రోజూ రైతు ఇబ్బంది పడింది లేదు. ఆ రోజు వన్ రూపీ ఇన్సూరెన్స్ ఉండేది కానీ ఈరోజు ఏ క్రాప్‌కు కూడా ఇన్సూరెన్స్ లేని పరిస్థితి ఉంది. పొగాకు రైతులే కాదు మొన్నటి వరకు రాష్ట్రంలో వరి రైతులకు కూడా గిట్టుబాటు ధర లేదు. దీనిమీద రైతులంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ● కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు బాధలు కన్నీళ్లు తప్ప సంతోషం లేదు. - బి. కోటేశ్వరరావు - కొండేపి పార్టీ కన్వీనర్. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పొగాకు రైతుల దీక్షకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతిస్తోంది. గతంలో 2019 నుంచి 2024 వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మన ప్రియతమ నాయకుడు వైయస్ జగన్ టైంలో రైతులందరూ చాలా ఆనందంగా ఉండే పరిస్థితి. కానీ రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క ఇంట్లో ఉన్న రైతుకి బాధలు, కన్నీళ్లు, ఆవేదన తప్పితే సంతోషం అనే మాట ఏ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక టొబాకో చెట్టు తయారవ్వడానికి దాదాపుగా ఒక 50 మంది కూలీలు పని చేస్తారు ఈ సంవత్సరం టొబాకో నారు రూ. 7000 రూపాయలు అమ్మింది. రైతులు కష్టం చేసి భగవంతుడిని నమ్ముకొని, మెడల్లో ఉన్న తాలిబొట్టులు సైతం బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ టొబాకో మీద పెట్టి ఖర్చు చేసి పండించారు. చివరికి పంటను అమ్మకానికి తీసుకెళ్తే అక్కడున్న బయ్యర్లు, కంపెనీ వాళ్లు అందరూ కలిసి రైతుని చిన్న చూపు చూస్తున్నారు. రైతుకి ఎక్కడా కూడా గౌరవం, విలువ గాని ఇవ్వడం లేదు. గతంలో వైయస్.జగన్ రైతులకి రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనాలు గాని పంట నష్టపోతే పంట పరిహారం ఇచ్చారు. కంది పంట నష్టపోతే ప్రతి ఇంటికి రెండు, మూడు లక్షలు వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈరోజు రైతు నష్టపోయి వారు పడుతున్న బాధ, ఉసురు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కి ప్రతి ఒక్క మంత్రికి చివరికి చంద్రబాబు నాయుడుకి తగులుతుంది. రాబోయే ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ● శ్రీనివాసరావు, వైయస్సార్సీపీ నేత - కూటమి ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా అన్యాయం. - అన్నదాతలకు అండగా నిలబడింది వైయస్.జగన్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసగాడో రైతుల మీద ఎంత ప్రేమ ఉందో రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మాటలోనే గమనించారు. రైతులకి ఏం చేస్తే మేలు జరుగుతుంది అనే ఆలోచనతో అనేక కొత్త పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి జలయజ్ఞం, ఉపాధి హామీ వంటి ఇన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులకు ఎంతో మేలు చేశారు. మళ్లా మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మన ప్రియతమ నేత వైయస్. జగన్ ముఖ్యమంత్రి అయి రైతులకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. తండ్రి గారు సూచించిన ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ తూ.చా. తప్పకుండా అమలు చేసి రైతు క్షేమం కోరిన ఏకైక రెండో ముఖ్యమంత్రి మన జగన్. 2024లో అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతుల్ని నాశనం చేయడానికే కంకణం కట్టుకుంది. ఇన్ని ఉద్యమాలు జరుగుతుంటే కనీసం ఈ అధికారంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికన్నా ఒక్కడికన్నా చీమ కుట్టినట్టు కూడా లేదు. మన ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకి ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం ఉంది. కానీ ఇప్పుడు పొగాకు రైతులు పడుతున్న బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదు. దీనిపై ఒక కార్యాచరణ రూపకల్పన చేసి.. రైతులకు న్యాయం చేసే వరకు పోరాడాలి. ● సుజాతమ్మ - వైయస్ఆర్‌సీపీ నేత. కనిగిరి నియోజకవర్గంలో పండిన పొగాకు పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఎక్కువ మంది వలసలు వెళ్తూ ఉంటారు. ఇక్కడ పంటలు వేసినా పండే పరిస్థితి లేదు, పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. రెండు మూడు సార్లు మేమందరం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించినప్పుడు రైతులందరూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్. జగన్ ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు సక్రమంగా అమలైతే... కూటమి పాలనలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని రైతులు బాధపడుతున్నారు. ఈరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరి పక్షాన...కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకునే వరకు పోరాటం చేస్తుంది.