బొబ్బ‌లిలో `బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ` 

చంద్ర‌బాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ ...ఇంటింటా ప‌ర్య‌ట‌న‌

బొబ్బిలి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు  సోమవారం ఉదయం బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలోని 22వ వార్డు ఐటీఐ కాలనీలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వ‌ర్యంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఇంటింటా ప‌ర్య‌టిస్తూ చంద్ర‌బాబు మ్యానిఫెస్టోను గుర్తు చేస్తూ ఈ ప్ర‌భుత్వం చేస్తున్న మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు.  కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణరావు,వార్డు ఇంచార్జ్ రెయ్యి భాగ్యలక్ష్మి, వాడపల్లి రజిని, మాజీ బుడా చైర్మన్ ఇంటి గోపాలరావు, మాజీ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ మెంబర్ తూముల భాస్కరరావు, బొబ్బిలి నియోజకవర్గ యువజన అధ్యక్షుడు బేతనపల్లి శంకరరావు, వివిధ వార్డు ఇన్‌చార్జ్ లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Back to Top