ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?

భీమిలిలో ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించిన సీఎం వైయస్‌ జగన్‌
 
ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారు

ఇటు పక్క పాండవ సైన్యం..అటు పక్క కౌరవ సైన్యం ఉంది

 పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్న‌ది అభిమన్యుడు కాదు.. అర్జునుడు

ఈ అర్జునుడికి  కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు

ఈ యుద్ధంలో చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే

మరో 25 ఏళ్లపాటు జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నాం

చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు

అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు

గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు

మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం

పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా

75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను

ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి

ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది

ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది

మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు

మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం
 
ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు

56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం

పేదల భవిష్యత్‌ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి

ఇది మీ పార్టీ.. ఇది ఒక జగన్‌ పార్టీ కాదు.. మీ అందరి పార్టీ

కష్టపడ్డవారందరికీ కూడా గౌరవం ఇచ్చిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీనే

మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం తెలియదు

మీ బిడ్డ చెప్పాడంటే... చేస్తాడంతే

ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

భీమిలి:  మ‌రో 75 రోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరాటానికి తాను సిద్ధ‌మ‌ని..మీరు సిద్ధ‌మా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల‌కు పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని సీఎం పేర్కొన్నారు.  ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం.. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు 175 స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా వారికి అభ్యర్థులు లేరు. చేసిన మంచిని నమ్ముకునే.. మీ బిడ్డ ఎన్నికలకు వెళ్తున్నాడ‌ని సీఎం పేర్కొన్నారు.  గతంలో చంద్రబాబు 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదు. మనం మేనిఫెస్టో లోని ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రతి గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా పాలన చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్బీకే లను నిర్మించామ‌ని సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారంటూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు.

 

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే...*

 

*అటు సముద్రం- ఇటు జనసముద్రం.*

భీమిలిలో ఇవాళ అటు సముద్రం.. ఇటు జనసముద్రం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మలోనూ, ప్రతిఅన్నా, ప్రతితమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ, తాతలోనూ, ప్రతి స్నేహితుడిలోనూ నాకు.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తుంటే.. అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్టచతుష్టయం ఉంది. గజదొంగల ముఠా ఉంది. 

 

 

*అభిమన్యుడు కాదు అర్జునుడు* 

వారు వ్యూహాలలో, కుట్రల్లో, కుతంత్రాలలో మోసపూరిత వాగ్ధానాలలో వెన్నుపోట్లు, పొత్తులు,  ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. 

కానీ పద్మ వ్యూహాంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు.

ఆ అర్జునుడికి ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరి తోడు ఉంది. ఇంతమంది కార్యకర్తలు, అన్నదమ్ముల తోడు కృష్ణుడి రూపేణా మీ అర్జునుడికి ఇంత అండదండలు ఇస్తున్న పరిస్థితులున్నాయి కాబట్టే మీ బిడ్డ భయపడడు. 

మీ అందరి అండదండలున్నంత కాలం మీ బిడ్డ తొణకడు. ఈ 56 నెలల్లో మనం పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తున్న ఆ పథకాలు, స్కీములే మనకు అస్త్రాలు, బాణాలు. ఈ యుద్ధంలో 175కు 175 స్ధానాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌.

ఈ యుద్ధంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా.... దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందే.

మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే గొప్ప అంశాలేమిటో మీ అందరితో పంచుకునేందుకు ఈ భీమునిపట్నంలో ఇవాళ సమావేశమయ్యాం.

 

 

*పాతికేళ్ల పాలన కొనసాగింపునకు సన్నాహకమిది*

2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్రయాత్రకు మరో పాతికేళ్ల పాటు మన సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహాక సమావేశం. ఈరోజు ఇక్కడ భీమునిపట్నంలో జరుగుతుంది. ఈ సమావేశం మన పార్టీని భుజాన మోసిన,మోస్తున్న కార్యకర్తలు, నేతలు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం. 

మేనిఫెస్టో ద్వారా మనమిచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత త్రికరణశుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ.. దాన్ని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఏకంగా  99శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం.

 

గతంలోనూ పార్టీలు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో అని ఎన్నికలప్రణాళికను విడుదల చేస్తాయి. ఎన్నికలు అయిన తరాత చెత్తబుట్టలో వేస్తున్న సాంప్రదాయాన్ని మనం చూశాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నాను. మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది.

మనం మార్చాం కాబట్టే... ప్రజలకు మనం దగ్గరయ్యాం కాబట్టే.. ప్రతి ఇంట్లోను మీ బిడ్డను, మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టే చంద్రబాబు లాంటి 75 ఏళ్ల వయస్సు మళ్లిన నాయకుడు  ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక... ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు. అంటే దాని అర్ధమేమిటో ఆలోచన చేయండి. ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పనులు చేశానని కానీ, తాను ఫలానా మంచి స్కీములు తెచ్చానని కానీ చెప్పలేక మరలా కొత్త వాగ్ధానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు అంటే దానికి అర్ధం ఏమిటో తెలుసా ? ప్రజల్లో వారు లేరు అని అర్ధం. చివరకి 2019లో వచ్చినన్ని ఆ 23 స్ధానాలు కూడా వాళ్లకు రావని అర్ధం.

175 స్ధానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్ధులు కూడా లేరని అర్ధం. 

 

*వైయస్సార్సీపీ చరిత్ర- ఇంటింటి విజయగాథ.*

మరోవంక మన పార్టీని చూడండి. మన పార్టీ చరిత్ర  విప్లవగాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయగాథ. మన భవిష్యత్‌ సామాజికవర్గాల ఇంధ్రధనస్సు. మనది వయస్సుతో పాటు మనసు, భవిష్యత్‌ ఉన్న పార్టీ. గడిచిన 56 నెలల పాలనలో అన్ని రంగల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిలోనూ సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ. మన పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను ఏకంగా 99 శాతం నెరవేర్చిన పార్టీ మనది. 

ఇవాళ మీ బిడ్డగా, అన్నగా, తమ్ముడిగా గర్వంగా చెబుతున్నాను. మీ బిడ్డ మోసాన్ని, అబద్దాన్ని నమ్ముకోలేదు. మనం చేసిన మంచిని, ఇంటింటికీ చేసిన అభివృద్ధిని నమ్ముకుని మీ బిడ్డ ఈరోజు మరలా ప్రజలదగ్గరకు వెళ్తున్నాడు. 

 

 

*21 శతాబ్ధ అభివృద్ధిలోకి పేదలను నడిపిస్తూ..*

మనది పేదరికం, అసమానతల సంకెళ్లను బ్రద్ధలు కొట్టి, ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ... 21 శతాబ్దంలోకి ఆ పేదలందరినీ నడిపిస్తున్న మనస్సున్న బాధ్యత గల ప్రభుత్వం.  

మీరే చూడండి. ఇంటింటికీ వెళ్లి ప్రతి పేదకుటుంబానికి కొన్ని విషయాలు మీరే వివరించండి. ప్రతి ఒక్కరి భుజస్కందాలమీద బాధ్యత పెడుతున్నారు. మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం. అబద్ధానికీ, నిజానికీ మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. మోసానికి, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పాలి.

 

*పది శాతం హామీలు అమలు చేయని బాబు*

2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు 650 వాగ్ధానాలు ఇచ్చారు. అందులో పదిశాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపు ఉన్నాడు. మరోవైపున మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలలో 99శాతం అమలు చేసి, ప్రతి ఇంట్లోనూ సంతోషాన్ని చూసి సంబరపడుతున్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వమని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.

 

*కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా..*

మరో విషయాన్ని మీరందరూ గమనించండి. ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా.. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ గ్రామైమైన తీసుకొండి. ఏ గ్రామానికి వెళ్లినా..ఆ గ్రామానికి చంద్రబాబుగారు ఏం చేశారుఅంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. కారణం చెప్పడానికి ఏమీ లేదుకాబట్టి.

 

మరి మీ బిడ్డ, మీ జగన్‌ ఏం చేశాడంటే... ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలోనూ ఎన్నెన్నో మార్పుల కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే గ్రామసచివాలయం కనిపిస్తుంది. అందులో 540కు పైగా పౌరసేవలు , దాదాపు 10 మంది మన పిల్లలే శాశ్వత ఉద్యోగాలు చేస్తూ చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తారు. ఈ శాశ్వత వ్యవస్ధను మన గ్రామాలకు తీసుకువచ్చింది ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఎక్కడా కరెప్షన్‌ లేకుండా, లంచాల్లేకుండా, వివక్ష లేకుండా ఇంటింటికీ ఒకటో తారీఖున ఉదయాన్నే పెన్షన్‌ అయినా పౌరసేవలైనా, లేకపోతే ఏ పథకమైనా కూడా మన గడపకే వచ్చిన చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామవాలంటీర్ల వ్యవస్ధ తీసుకువచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.

 

అదే గ్రామంలోనే రైతన్నలను చేయిపట్టుకుని నడపించే ఒక ఆర్బీకే వ్యవస్ధ ఆ గ్రామంలో కనిపించేంది, వచ్చింది కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి రైతన్న ఇంటికి వెళ్లి చెప్పండి. అదే గ్రామంలో మరో నాలుగుఅడుగులు వేస్తే ఒక విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ ఇంటింటికీ జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికీ తోడుగా ఉండేందుకు ఆరోగ్యసురక్ష కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వంలోనే వచ్చాయని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి పేదవాడికి చెప్పండి. 

నిరుపేదలు చదువుకునే మన గ్రామంలోని గవర్నమెంటు బడికి నాడు నేడుతో మళ్లీ మంచిరోజులు వచ్చి, అందులో చదువుకునే పిల్లలకు ఇంగ్లిషు మీడయంతో మొదలు, ట్యాబులు, ఐఎఫ్‌పీలు, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ వచ్చింది  కూడా మీ బిడ్డ పాలనలోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే సచివాలయంలో మహిళా పోలీస్‌ గ్రామంలోనే కనిపిస్తుంది. 

 

ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఫోన్‌. ప్రతి ఫోన్‌ లో దిశ యాప్‌ కనిపిస్తుంది. మహిళా పోలీసు గానీ, అక్కచెల్లెమ్మల ఫోన్‌లలో దిశ యాప్‌ గానీ ఏ అక్కచెల్లెమ్మకు అయినా అపాయం సంభవిస్తే.. కేవలం ఒక బటన్‌ నొక్కిన వెంటనే, లేదా ఫోన్‌ను 5 సార్లు ఊపిన వెంటనే 10 నిమిషాల్లోనే అక్కచెల్లెమ్మ దగ్గరికి పోలీసు సోదరుడు వచ్చే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 56 నెలల్లోనే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

ఇవన్నీ కూడా మన గ్రామానికి వచ్చిన బ్రాడ్‌ బ్యాండ్‌. బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలుతో పాటు డిజిటల్‌ లైబ్రరీలు కట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ ప్రతి గ్రామంలో మనందరి ప్రభుత్వంలో ఈ 56 నెలల్లోనే చేసిన గొప్పమార్పులుగా ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి.

 

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని అయినా తీసుకున్నా కనిపిస్తాయి. ఇలాంటి ఆలోచనలు, మార్పులు తీసుకురావాలని, కరప్షన్, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికీ చేయి పట్టుకొని నడిపించాలనే ఆలోచనలు, ప్రతి రైతన్నకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా నిలబడాలనే ఆలోచనలు... మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబునాయుడుకి ఏనాడూ కూడా కనీసం మనసుకు కూడా రాలేదు. మూడుసార్లు పాలించినా, 75 ఏళ్ల వయస్సువచ్చినా.. ఇంత గొప్పగా చేయొచ్చన్న ఆలోచన కూడా ఆ పెద్దమనిషికి రాలేదు. 

 

 

*వాళ్లు పెత్తందార్లు..*

కారణం.. వాళ్లు పెత్తందార్లు కాబట్టి. పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందార్ల పొలాల్లో పని చేసే ప్రజలు, తమ ఇళ్లల్లో çపనిమనుషులు ఆయన దృష్టిలో పొట్టపోసుకోవడం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం. 

ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామం బాగుపడదు. ఏ పల్లె కూడా బాగుపడదు. కారణం ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, భవిష్యత్‌ మారాలన్న తాపత్రయం ఈ పెత్తందార్లకు లేదు. 

 

 

*సంక్షేమంలో మనకూ బాబుకూ తేడా..*

రైతు సంక్షేమాన్ని చూస్తే మనమెక్కడ, చంద్రబాబు ఎక్కడ? ఆలోచన చేయండి.

రుణ మాఫీ చేస్తానని నిలువునా ముంచినది చంద్రబాబు. రూ. 87,612 కోట్లు రైతులు బ్యాంకులకు కట్టొద్దని పిలుపునిచ్చాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని అడ్వర్టైజ్‌మెంట్‌ ఇచ్చాడు. మొట్ట మొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టాడు. రుణమాఫీ నిలువునా ముంచినది చంద్రబాబు అయితే, ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

 

ఆర్బీకే అంటే జగన్‌. విత్తనమైనా, ఎరువులైనా, ఇన్‌ పుట్‌ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీజగన్‌. 

పగటిపూటే ఉచిత విద్యుత్‌ అయినా,  రైతులకు ఉచిత బీమా, సున్నా వడ్డీ అయినా అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా అందుతుంది అంటే  గుర్తుకొచ్చేది మీ జగన్‌. 

 

ఏ పొలంలోకి వెళ్లినా కూడా చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏముంది? చంద్రబాబు నాయుడు మార్క్‌ ఎక్కడుంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైయస్సార్‌ సీపీ. జగన్‌ మార్కు కనిపిస్తుంది. 

 

*వైద్య, ఆరోగ్యంలోనూ...*

ఇక ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. ఒక 108 చూసినా, ఒక 104 చూసినా ఏకంగా 3257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసినా, ఆరోగ్య ఆసరా చూసినా, గ్రామస్ధాయిలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, ఏ ఆశుపత్రికి వెళ్లినా డాక్టర్లు, నర్సులు కొరత ఉండదాని ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా 53 వేల కొత్త నియామకాలు.. నాడునేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు. ఇలా ఏది తీసుకున్నా కనిపించేది.. ఒక వైయస్సార్, ఒక జగన్‌. ఒక వైయస్సార్‌ సీపీ మార్క్‌ కనిపిస్తుంది. 

 

4 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా కూడా వైయస్సార్‌ సీపీ, జగన్‌ మార్క్‌ కనిపిస్తోంది. 

 

*విద్యారంగంలో చూస్తే...*

ఏ గవర్నమెంట్‌ బడిని తీసుకున్నా మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా నాడునేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలు,శ్రీమంతుల పిల్లలకు అందుబాటులో ఉండే బైజూస్‌ కంటెంట్‌ను మన ప్రభుత్వ బడుల పిల్లలకు అందించడం, గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, ఏకంగా క్లాసు రూముల్లో ఐఎఫ్‌ పీలు, గోరుముద్ద, పిల్లలకు బడి తెరిచే సరికే విద్యాకానుక, పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులు అప్పులుపాలయ్యే పరిస్థితులు రాకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, విదేశాల్లోని టాప్‌ యూనివర్సిటీలతో ఆన్‌ లైన్‌ వర్టికల్స్‌ ద్వారా డిగ్రీల అనుసంధానం, జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ లో మార్పులు, ఇంటర్న్‌ షిప్‌ కంపల్సరీతో డిగ్రీలో మార్పులు ఇలా ఏది తీసుకున్నా విద్యారంగంలో, ఎక్కడ కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు మార్క్‌? 

ఎక్కడ చూసినా ప్రతిచోటా కూడా కనిపించేది వైయస్సార్‌ సీపీ, జగన్‌ మార్క్‌ కనిపిస్తోంది. 

 

 

*సామాజిక న్యాయంలో..*

సామాజిక న్యాయం విషయంలో మనం ఏం చేశాం, చంద్రబాబు ఏం చేశాడన్నది చూద్దాం. పేద సామాజికవర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ నామినేటెడ్‌ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ కూడా ఈ వర్గాలకే ఇవ్వడం మొదలు.. కేబినెట్‌లో ఏకంగా 68 శాతం మంత్రిపదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్‌ గా ఒక బీసీలకే అందించాం.

 

కౌన్సిల్‌ చైర్మన్‌ గా ఎస్సీ. డిప్యూటీ చైర్‌ పర్సన్‌ గా నా అక్క ఒక మైనార్టీ.  ఇక్కడ నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల పదవులన్నింటిలో చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి వారినందరినీ గుండెల్లో పెట్టుకున్నాం.  

గుడి చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా నా ఎస్సీ, ఎస్టీ,బీసీ అన్మదమ్ములు కనిపిస్తున్నారు. ఆ ప్రేమ.. గుండెల నిండా ఉంది కాబట్టే మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలోనే అక్షరాలా 2.13 లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలు తీసుకొచ్చాం. 

స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్‌ లో 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో 2.13 లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలిచ్చాడు. ఈ ఉద్యోగాల్లో ఏకంగా 80 శాతం నా... అని పిలుచుకొని నా తమ్ముళ్లు, చెల్లెమ్మలే అక్కడ ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నాను.

 

 

ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే.. ఏకంగా రూ.2.53 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్లిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.  ఏకంగా 75 శాతానికి పైగా నా అంటూ నేను పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయింది.

 

నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆప్యాయత చూపిస్తున్నాం కాబట్టే ప్రతి గ్రామంలోనూ.. అట్టడుగున ఉన్న వారికి అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వులతో సెల్యూట్‌ కొట్టి పని చేసిపెడుతున్నారు. 

చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ? 

పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపడంలో చంద్రబాబు మార్క్‌ ఎక్కడ ఉంది? అని అడుగుతున్నాను. పేద వర్గాలు కనిపిస్తే... ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న నోటిలోంటి ఇలాంటి మాటలు వస్తే... గ్రామాల్లో ఎవరైనా ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా? 

బీసీల తోకలు కత్తిరిస్తానని మాట్లాడితే, ఆ బీసీలను గ్రామాల్లో ఎవరైనా పట్టించుకుంటారా? ఆలోచన చేయాలని అడుగుతున్నాను. చంద్రబాబుకు ప్రేమ సామాజిక వర్గాల మీద ప్రేమ ఎక్కడ ఉంది? 

 

ఎక్కడ చూసినా కూడా కనిపించేది.. ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కూడా కనిపించేది, ఏ పేదవాడి గుండెల నిండా ప్రేమగా కనిపించేది వైయస్సార్‌ సీపీ, జగన్‌ మార్క్‌ కనిపిస్తుంది. 

 

అక్కచెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో.. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజుదేశంతో మనం పోటీ పడుతున్నాం. 

 

ప్రతి అక్కచెల్లెమ్మ సంతోషంగా ఉంటే కుటుంబాలు బాగుంటాయి. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన అక్కచెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా వాళ్ల ముఖాలలో సంతోషాలను చూడాలని అక్కచెల్లెమ్మల కోసం ఎప్పుడూ జరగని విధంగా ఒక ఆసరా, ఓ అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత, వారు  ఉండటానికి గూడు ఉండాని, , లక్షాధికారి కావాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా ఇంటింటికీ మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. 

 

*మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది..*

2014లో ఎన్నికల ప్రణాళికలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఏటా సబ్సిడీ మీద 12 సిలిండర్లు ఇస్తామని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది.  బ్యాంకుల్లో కుదువపెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు. 

 

పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీని 2016 అక్టోబర్‌ నుంచి నిలిపివేస్తూ, దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది. 

ఏ పేద కుటుంబానికి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. 

నేను చెప్పినవన్నీ కూడా 2014లో తాను చేస్తానని చెప్పి, ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి, ఎన్నికలప్పుడు దాన్ని ఊదరగొడుతూ ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. అన్నింటిలోనూ మోసం.

 

నేను అడుగుతున్నా. ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా మన పార్టీకి ఓటు వేయమనిగానీ, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా ఓటు వేస్తామని గానీ అనగలరా? 

 

ఇవన్నీ విన్న తర్వాత.. ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత, ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా? 

 

నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. 

*2019లో మనం అధికారంలోకి రాకముందు...* 

ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు, అవినీతి లేకుండా, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికీ కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా, ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా పేదలకి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయీ కూడా.. వాళ్లకి ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా? అని నేను అడుగుతున్నాను. అలా చేయవచ్చని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉండేదా? 

 

కానీ కేవలం ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది. ఓ లంచాలు లేని వ్యవస్థ, గ్రామ స్థాయిలో మీరు, నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. ప్రతి పేదవాడికీ న్యాయం, మంచి చేస్తున్నాం. 

లంచం, వివక్ష లేని సుపరిపాలనను తీసుకొచ్చింది ఓ వైయస్సార్సీపీ పాసీపీ పార్టీ, మీ జగన్‌ అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

 

 

రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్నీ మీరంతా అడగండి, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు అడగండి. గత 10 సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని అక్కచెల్లెమ్మలను అడగండి. ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్ములను అడగండి. వారి బ్యాంకు అకౌంట్‌ను చూడమని అడగండి. వారి అకౌంటులో గతంలో చంద్రబాబునాయుడు పాలన కు సంబంధించి 2014–19 మధ్యలో ఏ ఒక్కరూపాయి అయినా వేసిందా? అని వారినే అడగండి. 

 

మళ్లీ అడగండి. 2019 నుంచి 24 మధ్య.. అంటే మీ ప్రభుత్వంలో, ఈ 5 సంవత్సరాల్లో ఆ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ రైతన్నలు,అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్‌ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడండి.. అని ప్రతి ఇంట్లోనూ చెప్పండి. 

 

*ఎన్ని కష్టాలున్నా పేదవాడి చిరునవ్వుకోసం..*.

కోవిడ్‌ కష్టాలు ఎన్ని వచ్చినా మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి ముఖంలో, కుటుంబంలో చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు. కోవిడ్‌ కష్టాలు ఎన్ని వచ్చినా సాకులు చెప్పలేదు, ఆదాయాలు తగ్గిన సాకులు చెప్పలేదు. తోడుగా, అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్లి ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, రైతన్నకు, అవ్వాతాతలకు చెప్పండి. 

 

 

*ఇది మీ అందరి పార్టీ*

*మీ బిడ్డ ప్రజలకు సేవకుడు మాత్రమే.*

వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్త, అభిమానికి, ప్రతి నాయకుడికీ ఒక్క విషయం చెబుతున్నా.. ఇది మీ అందరి పార్టీ. ఇది ఒక్క జగన్‌ పార్టీ కాదు. ఇది మీ అందరి పార్టీ. మీ బిడ్డ కేవలం మీ అందరికీ ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 

 

 

కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో.. వారికి పదవులు, అధికారాలిచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు,  దేశ చరిత్రలో లేని విధంగా కార్పొరేషన్లకు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం మనది. మార్కెట్‌ యార్డులు, దేవాలయ బోర్డుల్లో మొత్తంగా నామినేటెడ్‌ పదవుల భర్తీలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు ఇవ్వడం మీ అన్నకే సాధ్యమైంది. 

 

గతంలో టీడీపీ, చంద్రబాబు పార్టీ లంచాలు, పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అన్న వివక్షతో.. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారి కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి లంచాలు పుచ్చుకుంటూ ఉంటే, ఆ స్థానంలో మన ప్రభుత్వంలో మన చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికీ వెళ్లి లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని ప్రతి పేదకు అందిజేస్తుంది. 

 

మనందరి ప్రభుత్వానికి దన్నుగా మనందరితో కలిసి గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులందరితో అనుసంధానమై ప్రతి పేదకూ మంచి చేస్తూ వారి మన్ననలు పొందుతూ అడుగులు వేస్తోంది మన పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

కొంత మంది నాయకులకు అనిపిస్తుంటుంది. జగనన్న అందరికీ వాలంటీర్ల చేతుల్లో పెట్టాడు, లంచాలు లేకుండా ప్రతి ఇంట్లో సాయం చేస్తున్నారు అని కూడా అనిపిస్తుంటుంది. కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు, వారు కూడా మనల్ని అభిమానించే మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మనవాళ్లే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఎందుకంటే ప్రతి పథకాన్నీ ప్రతి పేద కుటుంబంలోకి తీసుకొని పోయి వాళ్లకు ఇవ్వాలన్న తపన, తాపత్రయం, మంచి చేయాలన్న ఆలోచన... మనసులో మన పార్టీపట్ల, మన పట్ల ఆ ప్రేమ, అనురాగం ఉంటేనే చేయగలుగుతారు. 

 

*మంచి చేయగలిగాం కాబట్టే..*

ఇలా మంచి చేయగలిగాం కాబట్టే ఈరోజు నేను గర్వంగా చెబుతున్నాను. మీలో ఎవరైనా సరే, మన పార్టీలో ఎవరైనా సరే..  వార్డు మెంబరు దగ్గర నుం ఎంపిటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, ఎంపీ, ఎమ్మెల్యే.. ఏ పదవికి పోటీ చేసినా ప్రజలందరూ మామూలు మెజార్టీ కాదు, గొప్పదైన మెజార్టీతో ఆ స్థానాల్లో కూర్చోబెడతారు. 

 

ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం.  నామినేషన్‌ పనుల కేటాయింపుల్లోనూ ఇదే న్యాయం చేస్తూ వచ్చాం. ఎవరూ గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు మొదలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీచైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభసభ్యులు, ఇలా అన్నించిలోనూ జగన్‌ను నమ్మిన వారు, వైయస్సార్‌ సీపీలో ఉన్న వారు, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నాను.

 

మనం ఈ 56 నెలల పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం కాబట్టే, వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాం కాబట్టే, ఇంతకముందు నేను చెప్పినట్టుగా...  ఇవాళ ఎవరైనా మన పార్టీ తరఫున నామినేషన్లు వేస్తే చాలు ప్రజలు ఆశీర్వదించి భవిష్యత్‌ లో ఇంత కంటే ఎక్కువ అవకాశాలు మనకు కల్పిస్తారు. మన కార్యకర్తలను గెలిపించే పార్టీ మన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. 

 

*జరిగిన మంచి చెప్పండి.*

రూ. 2.53 లక్షల కోట్లు మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తోంది. అలా వెళ్లేటప్పుడు ఎవరూ లంచాలు అడగం లేదు. ఎవరూ వివక్ష చూపడం లేదు. రాష్ట్రంలో ఈరోజు 84 శాతం ఇళ్లకు మీ బిడ్డ బటన్‌ నొక్కడం ద్వారా నా అక్కచెల్లెమ్మలకు న్యాయం,మంచి జరుగుతోంది. గ్రామాల్లో 92 శాతానికిపైగా ఇళ్లకు మేలు జరుగుతోంది. 

 

ఇంత మంచి జరిగింది కాబట్టే మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెబుతున్నాను. మీరు చేయాల్సిందల్లా ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లకు జరిగిన మంచి గురించి చెబుతూ వాళ్లందరినీ ఒక్కటే అడగండి, మీ బిడ్డకు కుతంత్రాలు, కుట్రలు, మోసం చేయడం, అబద్ధాలు ఆడటం తెలియదు.

 

మీ బిడ్డ పొత్తుల్ని నమ్ముకోలేదు, జిత్తుల్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

 

*ప్రతి కుటుంబం నుంచి  స్టార్‌ క్యాంపెయినర్‌..*

మీ బిడ్డ వల్ల మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ సైనికులుగా మీరే నిలబడండి అని, ప్రతి కుటుంబం నుంచి స్టార్‌ క్యాంపెయినర్‌ బయటికి రండి అని ప్రతి అవ్వా, తాతను ప్రతి అన్నను, తమ్ముడిని రైతన్నను అడగండి. 

 

ప్రతి కుటుంబం నుంచి బయటకు వచ్చిన వీళ్లు...  కనీసం 100 మందికైనా మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్లందరిచేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేటట్టుగా స్టార్‌ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి. 

 

 

*ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యమో చెప్పాలి...*

మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. దీన్ని మీరు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరికీ చెప్పాలి. ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ముఖ్యమైనవనేది చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకొనేందుకు మాత్రమే కావివి.   ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు. ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే వారి భవిష్యత్‌ మారుతుందని చెప్పండి. 

 

 

*పేదవాడి భవిష్యత్‌ మారాలంటే జగనే రావాలి...*

ప్రతి పేదవాడి భవిష్యత్‌ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలని చెప్పండి.  పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నీ, ఇంగ్లీషు మీడియం చదువులు రావాలనాన్న, పిల్లలచేతుల్లో ట్యాబులు రావాలన్నా, ఐఎఫ్‌ పీలు ఉండాలన్నా, మరో 10–15 ఏళ్ల తర్వాత ప్రపంచంతో పోటీ పడేలా చదువులు అందాలన్నా మీ జగన్‌ వస్తేనే జరుగుతుందని ప్రతి ఇంట్లోనూ గట్టిగా చెప్పండి. 

 

ఈ ఎన్నికలు ఎంత అవసరమే ప్రతి ఇంటికి వెళ్లి...ఆ ఇంటి వద్దనే అవ్వాతాతలకు చెప్పండి. పొద్దున్నే ఒకటో తారీఖున అది సెలవుదినమైనా, ఆదివారమైనా ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకూ, తాతకు, వితంతు అక్కకు, వికలాంగులకు  చిక్కటి చిరునవ్వుతో నేరుగా మీ ఇంటికి పెన్షన్‌ రావాలంటే ఒక్క జగన్‌ ఉంటేనే జరుగుతుందని చెప్పండి. 

 

ఈ రోజు మన ఇంటికే డాక్టర్లు వస్తున్నారు. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌ ఉంది. జల్లెడ పడుతూ ఏ మందులు కావాలని అడిగి మందులిస్తూ, పేదవాడికి ఆరోగ్యపరంగా ఏ అవసరం వచ్చినా చేయిపట్టుకొని నడిపిస్తున్న పరిస్థితులు కొనసాగాలంటే, ప్రతి పేదవాడూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా పేదవాడికి మంచి జరగాలంటే మీ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే అది జరుగుతుందని చెప్పండి. 

 

పిల్లల్ని బడికి పంపితే చాలు.. వాళ్ల మేనమామ అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి ఇస్తున్నాడు, ప్రతి అక్కకూ చేయూత ఇస్తున్నాడు. ఆసరా ఇచ్చాడు, సున్నా వడ్డీతో తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ప్రతి అక్కచెల్లెమ్మకూ చెప్పండి. ఇంత ఆర్థిక స్వావలంబన ఉండాలన్నా, కావాలన్నా మీ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని చెప్పండి. 

 

*మన జగన్‌ను తెచ్చుకుందామని చెప్పండి..*

గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసిన పెద్దమనిషి పాలన చూశాం. ఈరోజు జగనన్న మాత్రం మాట చెప్పాడు, రైతు భరోసా ఇస్తానన్నాడు చెప్పిన దానికన్నా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు. ప్రతి సంవత్సరం రైతు భరోసా మీ చేతికి అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా మీ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని, మీ జగన్‌ ను తెచ్చుకుందామని ప్రతి రైతన్నకూ చెప్పండి. 

 

 

*పేదవాడి తలరాతను మార్చేది మన ఓటు..*

మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఇక్కడి నుంచి 10–15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ, పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల జీతాలు తీసుకుంటూ తలరాతలు మార్చేవి ఈ ఎన్నికలు అని చెప్పండి. 

 

*విశ్వసనీయతకు అర్ధం చెప్పిందే– మీ బిడ్డ...*

పేదవాడికి మంచి జరగాలన్నా, భవిష్యత్‌ ఉండాలన్నా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

 చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి.  ఎన్నికల ముందు కేజీ బంగారం ఇస్తామనిమాట చెబుతారు. ప్రతి ఇంటికీ బెంజ్‌ కారిస్తామనిమోసం చేస్తారు. 

 విశ్వసనీయతకు అర్థం చెప్పింది మాత్రం మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ బిడ్డ చేయగలిగిందే చెబుతాడు. 

ఒక్కసారి చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. 

 

ఈ 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమైనా ఏ మంచైనా కొనసాగాలన్నా, భవిష్యత్‌ లో ఇవి పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్, డీబీటీ స్కీములు, ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని అర్ధం. 

 

ప్రతి పక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం.

మాకు ఈస్కీములు వద్దు, ఈ స్కీముల రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని, లంచాలు వివక్షతో కూడిన మళ్లీ జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్లీ ఓటు వేయడమే అని ఇంటింటికీ చెప్పమని అడుగుతున్నాను. 

 

 

*విపక్షాల మాటలు.. ఉత్త గొడ్డు అరుపులు..*

ఏ మంచీ చేయని వీరంతా పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తున్నాయి. 

 

ఓటి కుండకు మోత ఎక్కువ, ఉత్త గొడ్డుకు అరుపులెక్కువ, చేతగాని వాడికి మాటలెక్కువ అనే సామెతలు గుర్తుకొస్తున్నాయి. 

జనంలో లేని వారు, ప్రతి పేదవాడి గుండెలో లేని వారు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్నే టార్గెట్‌ గా, పేదవాడి భవిష్యత్‌ టార్గెట్‌ గా, వైయస్సార్‌ సీపీ టార్గెట్‌ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. 

 

*యుద్ధానికి మీరు సిద్ధమా.. ? దేవుడి దయతో, ప్రజల అండతో నేను సిద్ధం.*

ఈ యుద్ధానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను.  నేను సిద్ధం.. దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. 

 

*సమరశంఖారావం పూరిస్తూ..*

వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధం అని ఇక్కడి నుంచే వైయస్సార్‌ సీపీ పిలుపునిస్తోంది.  

 

2024లో మరో 60–70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను ఓడించేందుకు సిద్ధమా? 

 

*వచ్చే ఎన్నికలు– పేదలకు పెత్తందార్లకు యుద్దం.*

వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం, వారి వంచనకు, మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో, పంచుకో తినుకో అనే విధానానికి, మన డీబీటీ కి మధ్య జరుగుతున్న యుద్ధం. 

వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్యయుద్ధం. ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారిక కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం.వచ్చే రెండు నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే. 

మరోసారి అడుగుతున్నా. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా? 

 

*దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టండి...*

ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయాలి. ప్రతిపక్షం పది వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాను, వారి సోషల్‌ మీడియాను, సోషల్‌æ మీడియాలో చేసే దుష్ప్రచారాల్ని తిప్పి కొట్టాలి, అందుకు మీరు సిద్ధమా? ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్‌ ఫోన్లే మీకు అస్త్రాలు. 

 

సెల్‌ ఫోన్‌ ఉన్న ప్రతి పేదవాడూ సోషల్‌ మీడియాను శాసించబోతున్నాడు. బూత్‌ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు, రాజ్యసభ సభ సభ్యుల వరకు కీలక పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమేనా? 

వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్‌ 175కి 175 స్థానాలు మన టార్గెట్‌. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్‌. ఎందుకు రావు? అని అడుగుతున్నాను.

 

 

*టార్గెట్‌ 175 - టార్గెట్‌ 25...*

ప్రతి ఇంటికీ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామానికి మంచి జరిగినప్పుడు 60 శాతం కుటుంబాలు మీ వెంట, మన వెంట ఉంటే 175కు 175 ఎందుకు రావు, 25కు 25 ఎందుకు రావు. 

మంచి చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్‌ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. 

ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం, సై... అంటున్న మీ బిడ్డకు మీరంతా తోడుగా ఉండటానికి సిద్ధమా? 

 

మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు దేవుడి దయ, మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు. 

 

ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకూ ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, తాతకూ హృదయపూర్వకంగా రెండు చేతులూ జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ బిడ్డ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి మోగిస్తున్నాడు.

Back to Top