చంద్రబాబు..బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు..

బీసీ జయహో పేరుతో మళ్లీ మోసం...

వచ్చే ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారు..

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి..

ఏలూరు: బీసీల ఓట్ల ద్వారా గద్దె నెక్కిన చంద్రబాబు బీసీలను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. ఏలూరులో బీసీ గర్జనలో ఆయన ప్రసంగించారు.చంద్రబాబు బీసీ జయహో పేరుతో సభ పెట్టి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఇస్తానంటూ మళ్లీ మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు బీసీ కార్పొరేషన్‌ లోన్లు పంచుకుతింటున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప వారికి మేలు చేసే కార్యక్రమాలు రూపొందించడం లేదని దుయ్యబట్టారు.బీసీలకు ఆర్థిక పరిపుష్టి కలిగించి వారి జీవన ప్రమాణాలను పెంచాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు.బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. బీసీలను గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చూస్తానన్న చంద్రబాబు..వారిని మోసం చేశారన్నారు.బీసీలను చంద్రబాబు అవమానపరిచి, వారి ఆత్మగౌరవాన్ని  దెబ్బతీశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో బలహీనవర్గాలను ఆదుకోవాలనే సంకల్పంతో  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రతో అలుపెరగని వీరుడిగా రాష్ట్రమంతట పర్యటించారన్నారు.పాదయాత్రలో బీసీల సమస్యలు తెలుసుకుని..వారి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు.

Back to Top