అధికార వికేంద్రీకరణకు మద్దతుగా భారీ ర్యాలీలు

బోస్టన్‌, జీఎన్‌ రావు కమిటీలను ఆమోదించాలి

అనంతపురంలో భారీ ప్రదర్శన

తూర్పు గోదావరి జిల్లాలో నినదించిన స్థానికులు

అనంతపురం: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు చేపడుతున్నారు. శుక్రవారం అనంతపురం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి పాల్గొన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆస్తులు కాపాడుకునేందుకే చంద్రబాబు ఉద్యమిస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోస్టన్‌, జీఎన్‌ రావు కమిటీలను ఆమోదించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి మంత్రి శంకర్‌ నారాయణ, విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఇక్బాల్‌, వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌, తదితరులు సంఘీభావం తెలిపారు. 

Back to Top