విజయమ్మ దీక్ష ఒక రోజు వాయిదా! : ఆగష్టు 10, 2012

 విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేయతలపెట్టిన దీక్ష ఒక రోజు వాయిదా పడింది. తొలుత ఈ దీక్షను ఈ నెల 12, 13 తేదీల్లో చేయాలని భావించారు. 12న ఏపీపీఎస్సీ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు 13, 14 తేదీల్లో దీక్ష చేయాలని తాజాగా నిర్ణయించినట్లు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం వెల్లడించారు.

Back to Top