రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సిపిలోకి చేరికలు

హైదరాబాద్ : జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోనే తమ బతుకులు బాగుపడతాయన్న ఆకాంక్ష రాష్ట్ర ప్రజలలో రోజు రోజుకూ పెరుగుతోంది. కేవలం శ్రీ జగన్‌ వల్లే ప్రజా రంజకమైన రాజన్న రాజ్యం సాధ్యం అన్న ధీమా వారిలో వ్యక్తం అవుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల గాని, దానికి అడ్డగోలుగా వత్తాసు పలుకుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో గాని తమ కష్టాలు తీరే అవకాశం లేదని ప్రజలంతా ఇప్పటికే దృఢమైన నిర్ణయానికి వచ్చారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సువర్ణ పాలనను అనుభవించిన రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు శ్రీ వైయస్‌ జగన్‌ ఆశాదీపంలా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ జగన్‌ ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కాంగ్రెస్‌, టిడిపిల నుంచి నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి చేరుతున్నారు. కొత్తగా వచ్చి చేరుతున్న వారితో, ఆ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పార్టీ కార్యాలయాలు కోలాహలంగా మారుతున్నాయి.

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలం పేరూరుకు చెందిన టిడిపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. ‌పట్టణంలోని హౌసింగ్ బోర్డులో వైయస్‌ఆర్‌సిపి నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి సభ్యుడు బెల్లం ముత్యాలు, బిసి వర్గానికి చెందిన 50 కుటుంబాల వారు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వారికి ప్రకాశ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ, పేరూరులో బిసిలపై టిడిపి, కాంగ్రెస్ నాయకులు వివక్ష చూపుతున్నారన్నారు. సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పోలేపల్లిలో 300 మంది చేరిక:
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని పోలేపల్లిలో కాంగ్రెస్, ‌టిడిపిల నుంచి 300 మంది కార్యకర్తలు ఆదివారం వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. అనంతరం వైయస్‌ఆర్‌ సిపి జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీన‌ర్ శంకరనారాయణ మాట్లా‌డుతూ‌... కాంగ్రెస్, టిడిపిల పాలనలో నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజల గోడు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా శ్రీ వైయస్‌ జగన్‌కే సాధ్యమని అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జననేతను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యం :
ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలంలోని కొండంపేటలో వివిధ పార్టీల నుంచి 150 మంది యువకులు ఆదివారంనాడు వై‌యస్‌ఆర్‌సిపిలో చేరారు. వైయస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ సమక్షంలో ‌వారంతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని జనార్దన్‌ అన్నారు. సర్పంచులు, ఎంపిటిసిలు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‌జననేత జగన్ సిఎం కావడం తథ్యం :
కృష్ణాజిల్లా కంకిపాడు మండలం తెన్నేరులో యువజన నాయకులు కలపాల వజ్రాలు, జి. రవికుమార్‌ ఆధ్వర్యంలో 50 మంది ఆదివారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం కావడం ఖాయమని ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కుక్కల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పులేటి కల్పన పిలుపునిచ్చారు.

వచ్చేది రాజన్న రాజ్యమే: గౌరు
కర్నూలు జిల్లా గుడంబాయి తండాకు చెందిన కాంగ్రెస్, ‌టిడిపి నాయకులు, కార్యకర్తలు వెంకటేష్ నాయ‌క్, కృష్ణా నాయ‌క్, గుండా‌ల్ నాయ‌క్, పుల్లన్న నాయ‌క్ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు‌ వెంకటరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సిపిలో చేరారు. కాల్వ మాజీ ఉప సర్పంచ్ ఈదురు సాహె‌బ్, తిప్పాయిపల్లె సుధాక‌ర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. వీరందరికి గౌరు వెంకటరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో రాజన్న పాలనను తెస్తుందని ‌వెంకటరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాల్వలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. వైయస్‌ఆర్‌సిపికి గ్రామాల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ, భవిష్యత్తులో వైయస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలను దూరం చేస్తుందన్నారు.

అధిక సంఖ్యలో యువకుల చేరిక :
మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 300 మంది కళాశాలల విద్యార్థులు, యువకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యుడు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంతకు ముందు యువకులు ర్యాలీ నిర్వహించారు.
 
దేశ, రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి కేవలం యువతకే ఉందని ఈ సందర్భంగా రావుల రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. ఆదివారం స్థానిక సాయి ఫంక్షన్ హాలులో జరిగిన మండల, పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి రాజకీయాలను యువతే ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. ‌వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు అన్ని వర్గాల యువకులు ముందుకు వస్తున్నారన్నారు.

వైయస్‌ఆర్‌సిపి ఘన విజయం తథ్యం :
ప్రజాబలం మెండుగా ఉన్న వైయస్‌ఆర్‌సిపి వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని నెల్లూరు జిల్లా పార్టీ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సహకార సంఘాల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే కార్యక్రమాన్ని ఆయన ఆదివారంనాడు  అల్లూరుపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీరంగుంట, అల్లూరుల నుంచి పార్టీలో చేరిన వారిని కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరినవారిని సాదరంగా ఆహ్వానించారు.
Back to Top