నమ్మకద్రోహ దీక్ష 2018

తన అసమర్ధతను, అతి తెలివిని, అవివేకాన్నీ, చేతగానితనాన్నీ
కప్పిపుచ్చుకోవడానికి ప్రతి సంవత్సరం చంద్రబాబు ఆడే నాటకమే నవనిర్మాణ దీక్ష. ఈ
విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు గనకనే సభల్లో బోసి కుర్చీ దర్శనమిచ్చాయి.
నాలుగేళ్లుగా ఏ అభివృద్ధీ లేకుండా,
వందల కొద్దీ వాగ్దానాల్లో పట్టుమని
పదైనా నెరవేర్చకుండా, పరిపాలనంతా అవినీతిమయం చేసి, దేశమంతా ఆ అవినీతి గబ్బుని
తిట్టిపోస్తుంటే, ప్రజలకు సమాధానం ఇచ్చుకునే ధైర్యం లేక దీక్షల పేరుతో ప్రజా ధనాన్ని
దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు చౌకబారు చర్యలే ఈ నవనిర్మాణ దీక్షలు. స్వయంగా
ముఖ్యమంత్రి ఆదేశించినా చాలాచోట్ల నాయకులు గైర్హాజరయ్యారు. ప్రజలు తమ వ్యతిరేకతను, అపనమ్మకాన్నీ సభలకు
రాకుండా ప్రదర్శించారు.  

దీక్షంటే ఆడిపోసుకోవడమా

ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ను, నిన్నటి మిత్రడు
నేటి అర్థ శత్రువు అయిన బీజేపీని తిట్టడమే చంద్రబాబు దీక్షల ఉద్దేశ్యం. అన్యాయం
జరిగిపోయింది, మోసం జరిగిపోయిందని కల్లబొల్లి ఏడుపులు ఏడ్వడం, రాబోయే ఎన్నికల్లో
అన్ని ఎంపీ సీట్లు ఇస్తే ఇరగదీసేస్తానని ప్రగల్బాలు పోవడం...గత కొన్నాళ్లుగా బాబు
చేస్తున్న దీక్షలన్నిటి సారాంశం ఇదే. బాబుగారు గొంతు చించుకున్నారని, బీజేపీని, వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీనీ ప్రజలు ద్వేషిస్తారనుకుంటే అది చంద్రబాబు మూర్ఖత్వమే. చంద్రబాబు దుబారా
ఖర్చులు, కేంద్రం లెక్కలు అడగటం, దానికి బాబు నీళ్లు నమలడం, దాంతో కేంద్రం
నుంచి రావాల్సినవన్నీ ఆగిపోవడం అన్నీ తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు.  చంద్రబాబు దీక్షల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. అది చాలక వాటి
ప్రచారాలకోసం కూడా కోట్లు తగలేస్తున్నారు. ఒక్క దినపత్రిక ప్రకటన ఖరీదే 8కోట్లట. మోదీ
ప్రచార ప్రధాని అని ఎద్దేవా చేసిన చంద్రబాబు...ఇవాళఅన్నిపేపర్లలో వేయించుకున్న
చాంతాడు ప్రకటన చూడండి. రాష్ట్రం ఓ పక్క సమస్యల్లో చిక్కుకుని అల్లాడుతుంటే, ఈయన తన సోషల్
మీడియా ప్రచారానికి ఏడాదికి 6
కోట్లు గుండంలో పోస్తున్నాడు. అంగట్లో
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలాగా అన్ని వనరులూ ఉన్నా, రాష్ట్రం అసమర్థ
పాలనలో తన ఉనికినే కోల్పోయే స్థితిలో పడింది.

బాబు వంచనకు సాక్ష్యం కాగ్ రిపోర్టే

చంద్రబాబు చేసిన అవినీతిని కాగ్ తన
నివేదికలో ఎండగట్టింది. టిడిపి ప్రభుత్వానికి కాగ్ వేసిన ప్రశ్నలు చూస్తే
చంద్రబాబు సర్కార్ అవినీతి విశ్వరూపం బైటపడుతుంది. లెక్కలు చూపకుండా 1,583 కోట్ల రూపాయిలు పర్సనల్ డిపాజిట్ ఎక్కౌంట్లకి దారిమళ్లించారు. 130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృద్ధా చేసి లెక్కలు చెప్పలేదు. 31 ప్రాజెక్టులు
మార్చి 2017 నాటికి పూర్తి చేస్తామని చెప్పి, అంచనా వ్యయాన్ని 27,403 కోట్లు పెంచి కాంట్రాక్టర్లకు లబ్ది చేశారు. కానీ అవి పూర్తికాలేదు.
నీరు చెట్టు కోసం బడ్జెట్లో 135
కోట్లు ఇచ్చి, 1,242 కోట్లుగా లెక్కచూపించారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో దోషిగా
తేల్చిన సంస్థకు, ఎపిలో ప్రభుత్వం ఎక్కువ ధరకు కాంట్రాక్టులు ఇవ్వడంలో మతలబేంటి? తక్కువ ధరకే
దొరుకుతున్న హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్ట్ ను అధికంగా 220 కోట్లకు ఎందుకిచ్చారు. హెలికాఫ్టర్ వాడకపోయినా 14.33 కోట్లు అద్దెలు చెల్లించినట్టు బిల్లులు చూపించింది ప్రభుత్వం.
స్లాబు పనులే కానీ క్వార్టర్స్ నిర్మాణం పూర్తైపోయినట్టు 770 కోట్లకు లెక్కలు పెట్టారు. ఎపి రెవెన్యూ శాఖలో గత ఆర్థిక
సంవత్సరానికి 530.74 కోట్ల పన్ను ఎగవేత ఉంది. రవాణా, పవర్, మైనింగ్ శాఖలు అసలు కేంద్రానికి లెక్కలే
ఇవ్వడం లేదు. పట్టిసీమ నుండి పరిశ్రమలకు నీళ్లు ఇవ్వడం ద్వారా అంచనా ఆదాయం 41.5 కోట్లు అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ పరిశ్రమలేవీ వాటి
వివరాలేంటీ అనేవి లిస్టులో లేవు. రెవెన్యూ లోటు అంటూ చంద్రబాబు కథలు చెబుతున్నాడు.
నిధుల దుర్వినియోగం ఇంతకంటే భారీ స్థాయి లో జరుగుతోంది. బాబు నిర్వాకం వల్లే నేడు
రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించింది.

ఇంత చేసాక కూడా ధర్మపోరాటం, నవనిర్మాణం, హోదా పోరాటం అంటూ
కాలక్షేపం చేసి, నెపాన్ని కేంద్రంలోని అధికారపార్టీ మీదకి నెట్టే కుతంత్రం ఒక్కటే
చంద్రబాబు చేస్తున్నది. రాష్ట్రంలో నిర్మాణాలే లేవు. రాజధానీ లేదు. పరిశ్రమలూ
లేవు. రాష్ట్రం పరిస్థితి నానాటికీ తీసికట్టులా తయారౌతోంది. బాబు నవనిర్మాణ దీక్ష
ప్రజల సహనానికి పరీక్ష. బాబు అవకాశవాదానికి పరాకాష్ట. 

Back to Top