ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైయస్‌ఆర్‌సీపీదే గెలుపుతూర్పు గోదావరి: ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీదే విజయమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పి.గన్నవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతు గుండె చప్పుడు విన్న ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధనకు పాదయాత్రగా వస్తున్న వైయస్‌ జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారన్నారు. నాలుగేళ్ల క్రితం మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తూర్పు గోదావరి జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ జెండా రెపరెపలాడుతుందని కన్నబాబు చెప్పారు.  
 
Back to Top