పోటెత్తిన న‌ర‌సాపురం


ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాక‌తో న‌ర‌సాపురం ప‌ట్ట‌ణం జ‌న‌సంద్ర‌మైంది. ప‌ట్ట‌ణంలోని స్టీమ‌ర్ సెంట‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగాజ‌నం త‌ర‌లిరావ‌డంతో పోటెత్తింది. కొద్దిసేప‌టి క్రిత‌మే వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 2200 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటింది. సాయంత్రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.
Back to Top