<br/>గుంటూరు: మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ప్రజా సంకల్ప యాత్ర బుధవారం ఉదయం మంగళగిరి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైంది. ఇవాళ పాదయాత్ర పెనుమాక మీదుగా ఉండవల్లి వరకు సాగుతోంది. సాయంత్రం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.