అవినీతి పాలన అంతం చేసేందుకే ప్రజా సంకల్ప యాత్ర 

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: ప్రజాస్వామ్యం కాదని చంద్రబాబు అడ్డగోలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, రాష్ట్రంలో అనైతిక పాలన సాగుంతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఈ రాష్ట్రంలోని పౌరులను ఒక వర్గం వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలకు, రాజకీయా పక్షాలకు ఎలాంటి సమాచారం లేకుండా పాలిస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి పాలనను అంతం చేసేందుకు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించిందన్నారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top