పచ్చపార్టీపై ప్రజాగ్రహం


రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కన చేర్చుకొని ఆదరిస్తున్నారు. బాబు మాయమాటలను నమ్మి మోసపోయామని ఈసందర్భంగా ప్రజలు నేతలకు మొరపెట్టుకుంటున్నారు. ఏగడపకెళ్లినా ఒకటే ఆవేదన.  ఏ ఇంటికి వెళ్లినా అరణ్యరోదనే. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి అవినీతి, అక్రమాలు, అరాచకాలతో రాజ్యమేలుతున్న చంద్రబాబుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ఇంటింటికీ వైయస్సార్సీపీ నేతలు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ప్రజాబ్యాలెట్ లో బాబుకు ఒక్క మార్కు కూడా పడడం లేదు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.  వైయస్ జగన్ వస్తేనే తమ కష్టాలు తీరుతాయని, జననేతను సీఎం చేసుకుంటామని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


Back to Top