చంద్రబాబుది పూటకో మాట


ఢిల్లీ: చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పూటకో మాట మార్చుతున్నారని, ఇలాంటి వ్యక్తికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం అరుణ్‌జైట్లీ హోదా ఇవ్వలేమని చెబితే చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్యాకేజీని స్వాగతిస్తున్నామని, ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను శాలువాలతో సన్మానించారన్నారు. ఆ రోజు ఇది అన్యాయమని వైయస్‌ జగన్‌ అంటే..చంద్రబాబు కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారన్నారు.అయిపోయిన పెళ్లికి మేళాలేందుకు అన్నారని గుర్తు చేశారు. ఇన్ని రకాలుగా హోదాను అవహేళన చేసిన చంద్రబాబు ఇవాళ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదాను బలంగా కోరుకుంటున్నారని గ్రహించిన చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ప్రజల ఆగ్రహానికి గురవుతామని భావించి పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

 
Back to Top