ఒక్క పంటకైనా మద్దతు ధర ఇచ్చారా బాబూ?

హైదరాబాద్‌:  ఏ ఒక్క పంటకైనా మద్దతు ధర ఇచ్చారా అని అని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో అన్ని రంగాలు కుప్పకూలిపోయాయన్నారు. తుని ఘటన, రాజధాని ప్రాంతంలో తోటలు ధ్వంసం చేయడం వంటి సంఘటనలన్నీ టీడీపీ నేతలే చేస్తే ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. తాజాగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేపై బెట్టింగ్‌ కేసు బనాయించి భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్‌కు ఎలాంటి గతి పట్టిందో చంద్రబాబుకు అలాంటి పరిస్థితి తప్పదన్నారు. రుతుపవనాలను ఒడిసిపట్టుకుందామని, దోమలపై యుద్ధం ప్రకటించామని, కరువును జయించామని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర ఇవ్వలేకపోయారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు విస్తిర్ణం తగ్గిందన్నారు. ప్రకృతి కూడా సహకరించడం లేదన్నారు. వర్షాలు లేక రైతులు నష్టపోతే..తాజాగా అకాల వర్షాలు రైతులను ముంచాయన్నారు. 16 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే లక్ష హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రకృతి వైఫరిత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని నిలదీశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరాహార దీక్షలు చేసిన చంద్రబాబు ఇప్పుడేందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టిన చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు. దేశానికి తిండిపెట్టే రైతును ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. జన్మభూమి కమిటీల మాదిరిగా తయారు చేసి మార్కెట్‌ యార్డులలో రైతులను మోసం చేశారన్నారు. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాల్లో 17 శాతం వృద్ధి రేటు సాధించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి కేంద్ర బృందానికి రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులు చూసి కళ్లలో నీళ్లు వచ్చాయన్నారు. 
 
Back to Top