రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిపై వైయస్‌ జగన్‌ పాదయాత్ర


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 187వ రోజు మధ్యాహ్న భోజన విరామం అనంతరం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. కొవ్వూరు నుంచి వేలాది మందితో కలిసి పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌ ఇప్పుడే రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిపైకి చేరారు. వైయస్‌ఆర్‌సీపీ జెండాలతో గోదావరి బ్రిడ్జి కళకళలాడుతోంది. గోదావరిలో 600 పడవలతో వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు.  బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలతో జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. మత్స్యకారులు, కళాకారులు వినూత్నరీతిలో స్వాగతం చెబుతున్నారు.
 
Back to Top