టీడీపీ పనైపోయింది

కర్నూలు: చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నంద్యాలలో ‘మాయాబజార్‌’  చూపిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నికతో టీడీపీ ఊహలు తారుమారు అవుతాయన్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఆ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందన్నారు.

టీడీపీని గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, వైయస్‌ఆర్‌ సీపీ గెలిస్తే అభివృద్ధి ఎందుకు ఆగిపోతుందని అంబటి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారా అని ప్రశ్నలు సంధించారు. నంద్యాల ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని అంబటి కోరారు. ఉప ఎన్నికలో చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు.
Back to Top