లొట్టలపాలెం నుంచి పాదయాత్ర ఆరంభం

విజయనగరం 10 జూలై 2013:

శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారానికి 205వ రోజుకు చేరింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి  షర్మిల పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సాగుతున్న  సంగతి తెలిసింది. బుధవారం లొట్టలపాలెం నుంచి ఆమె యాత్ర ప్రారంభించారు. యాటపాలెం,కొత్త భీమసింగి, భీమసింగి, సోమయాజులపాలెం, వెంకటరాజుపాలెం మీదుగా శ్రీమతి షర్మిల నడుస్తారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు వైయస్ఆర్ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమెతో కరచాలనం చేసేందుకు స్థానికులు ఊవ్విళ్లూరుతున్నారు.

Back to Top