జగన్‌పై వెల్లడవుతున్న అభిమానం

నర్సీపట్నం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల కోరుతూ చేపట్టిన  జన సంతకం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి శ్రీ జగన్మోహన్‌ రెడ్డికి మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు. నాలుగు రోజులుగా పార్టీ నాయకుడు పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. గొలుగొండ మండలం చీడిగుమ్మలలో సుర్ల గిరిబాబు ఆధ్వర్యంలో సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ శ్రీ వై.యస్.జగన్మోహన్‌ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. సంతకాలు చేయడానికి అధిక సంఖ్యలో జనం తరలి రావడం చూస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానం ఏమిటో తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రుత్తల సర్వం, పార్టీ నాయకులు మీసాల సత్యనారాయణ, పీలా వెంకటలక్ష్మి, అరుగుల రాజుబాబు, రెడ్డి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top