బొత్స వ్యాఖ్యలకు వైయస్ఆర్ కాంగ్రెస్ ఖండన

హైదరాబాద్:

ఢిల్లీలో సామూహిక అత్యాచార ఘటనపై పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తప్పుపట్టింది. మహిళలను గురించి చులకన భావంతో మాట్లాడటం తగదని కొల్లి నిర్మలా కుమారి పేర్కొన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. అనంతరం, బొత్స దిష్టి బొమ్మను దహనం చేశారు. పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన రెడ్డి, రంగారెరెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో వంక తన వ్యాఖ్యల ద్వారా మహిళలంటే ఎలాంటి గౌరవముందో బొత్స చాటుకున్నారని పార్టీ సాంస్కృతిక విభాగతం కన్వీనర్ వంగపండు ఉష వ్యాఖ్యానించారు.

తాజా ఫోటోలు

Back to Top