ఆత్మార్పణలు వద్దన్నదే వైఎస్ జగన్ విధానం.!

ఆందోళనకరంగా ఆరోగ్యం..!

గుంటూరుః ఎవరూ ఆత్మార్పణకు పాల్పడవద్దన్నదే వైఎస్ జగన్ విధానం. ఈక్రమంలోనే  రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ప్రత్యేకహోదాని సాధించేందుకు వైఎస్ జగన్ దీక్ష చేపట్టారు. గతంలో  మునుకోటి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వైఎస్ జగన్ స్పష్టంగా ఒకటే చెప్పారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ భావోద్వేగంతో మాసుమయ్య లాంటివాళ్లు ప్రాణార్పనకు సిద్ధపడుతుండడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యేకహోదా కోసం దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం పూర్తిగా విషమిస్తోంది. దీక్షాస్థలిలో సొమ్మసిల్లిన జగన్ ఉదయం నుండి కూర్చున్న ప్లేస్ లోనే పడుకొన్నారు. 

ఏ క్షణంలోనైనా కోమాలోకి..!
వైఎస్ జగన్ ఆరోగ్యం గంటగంటకూ విషమిస్తోంది. శరీరంలో అన్నీ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. వైఎస్ జగన్ ఏక్షణంలోనైనా  కోమాలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్ దీక్షపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆందోళన చెందుతున్నారు. దీక్షవిరమించాలని ఎవరు సూచించినా వైఎస్ జగన్ ససేమిరా అంటున్నారు. హోదాపై ప్రభుత్వాలు ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తానని వైఎస్ జగన్ తేల్చిచెబుతున్నారు. 
Back to Top