వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్ల నిర‌స‌న‌

 వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ పుణ్యశీల
 

విజయవాడ:  విజ‌య‌వాడ మున్సిప‌ల్ కౌన్సిల్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం, టీడీపీ నేత‌లు అనుస‌రిస్తున్న విధానాల‌ను వైయ‌స్ఆర్ సీపీ కార్పొరేట‌ర్లు తూర్పార‌బ‌ట్టారు. బ‌డ్జెట్ కేటాయింపుల‌పై కార్పొరేట‌ర్లు మంగ‌ళ‌వారం కౌన్సిల్ హాల్‌లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్ పుణ్య‌శీల మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదని తెలిసిన రూ.1968 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు డబ్బులు కట్టించుకుని..ఇప్పుడు లబ్ధిదారులకు సింగిల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించారని విమర్శించారు. కౌన్సిల్‌ హాలు వద్ద వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.అసమర్థతను ఒప్పుకుంటూ రంగులు పూసుకునే ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.

Back to Top