గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అబ్బయ్య చౌదరి పిలుపు

పెదవేగి మండలంలో 30 మంది పార్టీ గ్రామ అధ్యక్షులకు స‌న్మానం 

పెదవేగి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి బలోపేతానికి కృషి చేయాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు కొండలరావు పాలెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెదవేగి మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన 30 మంది గ్రామ పార్టీ అధ్యక్షులకు పార్టీ కండువాలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ కమిటీలు పార్టీకి వెన్నెముకలని, గ్రామ స్థాయి నుంచే పార్టీ బలపడాలని ఆయన పేర్కొన్నారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు ప్రజలతో మమేకమై, పార్టీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ అబ్జర్వర్లు, నూతన అధ్యక్షులు, అనుబంధ విభాగాల సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top