గడప గడపకు `బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ

గాజువాకలో “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” స‌న్నాహాక స‌మావేశం

విశాఖ‌: గాజువాక నియోజకవర్గ స్థాయి “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో గాజువాక క్లబ్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు కెకె రాజు గారు, మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరుకూటి అప్పారావు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెకె రాజు గారు, తిప్పల దేవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకుంటున్న అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తీసుకున్నామన్నారు. త్వరలో ప్రతి వార్డులో “గడప గడపకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజలెదుట చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలను తెలియజేసే విధంగా ప్రణాళిక రూపొందించ బడుతుందనన్నారు. ప్రతి కార్యకర్త ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని, మోసం చేసిన పాలకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెడాడ రమణ కుమారి, ఉరుకుటి చందు, మొహమ్మద్ ఇమ్రాన్, భూపతిరాజు సుజాత, గుడివాడ లతీష్, రాజాన వెంకటరావు,  గుడివాడ లతీష్, పల్లా చిన్నతల్లి, వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీను, మద్దాల అప్పారావు, పెదిరెడ్ల ఈశ్వర రావు, పల్లా సురేష్, సండ్రాన నూకరాజు, కొణతాల రాము, భూపతిరాజు శ్రీనివాస రాజు, షౌకత్ ఆలి, గొందేసి బుజ్జి, మంత్రి శంకర నారాయణ, రావాడ శివ, మహాలక్ష్మి నాయుడు, పూర్ణానంద శర్మ, దాడి నూకరాజు, కోమటి శ్రీను, బొడ్డ గోవింద్, రంభా నారాయణ మూర్తి, అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు పెడాడ రమణి కుమారి, జీలకర్ర నాగేంద్ర, చిక్కాల సత్యనారాయణ, గౌస్, గొందేసి వెంకటరమణ రెడ్డి, రోజా రాణి, శిరీష, వరలక్ష్మి, చిత్రాడ వెంకట రమణ, ఇళ్లపు రాము, బోడి వెంకటేష్,  గుర్రం శ్రీను, సిరట్ల వాసు, జాన్ ప్రసాద్,  తదితరులు పాల్గొన్నారు.

Back to Top