అక్రమ కేసుల‌కు భ‌య‌ప‌డేది లేదు

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి

విశాఖ‌: అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని,  ప్రజల తరుపున వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి స్ప‌ష్టం చేశారు. ఈ నెల 23వ తేదీన జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై విశాఖ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. మహారాణిపేట పోలీసు స్టేష‌న్‌ కి రావాలని నోటీసు ఇవ్వ‌డంతో సోమ‌వారం ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి, విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి,  విశాఖపట్నం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి,  లీగల్ సెల్ అధ్య‌క్షుడు రవి, రాష్ట్ర మహిళా కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీదేవి, బొడ్డ గోవింద్, రాష్ట్ర మహిళా కమిటీ సెక్రటరీ విజయ లక్ష్మి తదితరులు సంబంధిత అధికారులను కలిసి బెయిల్ పేపర్స్ పై సంతకం చేశారు. 

Back to Top