కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం.

అంతేగాని వైయ‌స్ జగన్  గారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించం.

చంద్రబాబు,లోకేష్ లే నయవంచకులు....మోసం, దగా, కుట్ర అంటేనే చంద్రబాబు గుర్తుకువస్తారు.

తెలుగుదేశం పని 2024 ఎన్నికలతో ఫినీష్ అవుతుంది.

మీడియాతో వైయస్ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత.

తాడేప‌ల్లి:  సీఎం వైయ‌స్‌  జగన్  గారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించబోమని వైయస్సార్ సిపి మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత కాలవశ్రీనివాసులును హెచ్చరించారు.రాయదుర్గం సభలో చంద్రబాబు మెప్పు పొందేందుకు కాలవ శ్రీనివాసులు జగన్ గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని అన్నారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మాట్లాడుతూ కాలవ శ్రీనివాసులు జగన్ గారిని నయవంచకులంటూ తూలనాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.నిజానికి రాష్ర్ట ప్రజలను నిత్యం మోసం చేసే చంద్రబాబు,లోకేష్ లే నయవంచకులని మండిపడ్డారు.రాష్ర్టాన్ని విధ్వంసం వైపు పయనింపచేసింది చంద్రబాబు అని అన్నారు.అమరావతి రాజధానిపేరుతో వేలకోట్ల రూపాయలు  దోచుకుంది చంద్రబాబు కాబట్టే ప్రజలు 2019లో 23 స్దానాలకే టిడిపిని పరిమితం చేశారన్నారు.రానున్న ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం కావడంతో దిక్కుతోచని స్దితిలో చంద్రబాబు,కాల్వశ్రీనివాసులు లాంటి వాళ్లు అభూతకల్పనలు ప్రచారం చేస్తూ జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

     కాలవ శ్రీనివాసులకు దమ్ము,ధైర్యం ఉంటే జగన్ గారిపై పాలన,చంద్రబాబుపాలన ఏది ప్రజలకు మేలు చేసిందనే అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.  కాల్వ శ్రీనివాసులు ఆరోపించిన ప్రతీ మాట పై చర్చిద్దాం..రావాలని కోరారు. ప్రజల జగన్ గారిని పాలనను మెచ్చుకున్నారు కాబట్టే సిద్దం సభలకు,మేమంతా సిధ్దం బస్సుయాత్రకు తండోపతండాలుగా వచ్చి తమ మధ్దతు తెలియచేస్తున్నారని అన్నారు.అదే సమయంలో చంద్రబాబు సభలు వెలవెల బోతున్నాయని ఎద్దేవా చేశారు.ఇదే ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయనేందుకు నిదర్శనం అన్నారు.చంద్రబాబు ప్రజలను మోసం చేస్తుంటే కాల్వ శ్రీనివాసులు చోద్యం చూశారు.మీ ప్రాంతానికి కృష్ణాజలాలు రాలేదనడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు.చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారన్నది మోదీ కాదా అన్నారు.కాల్వ శ్రీనివాసులు వెళ్లి ఈ విషయాన్ని మోదీని అడగాలన్నారు.చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రజలను...ఎస్సీ. ఎస్టీలను.మైనారిటీలను..బిసిలను మోసం చేశాడో మర్చిపోయావా....కార్పొరేట్ కాలేజ్ లకు వంతపాడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అదికారంలోకి వచ్చాకే పేదలకు మెరుగైన విద్యఅందిస్తున్నారని అన్నారు.ప్రజలకు మంచి చేస్తుంటే చూస్తూ ఓర్వలేకపోతున్నారు.

చంద్రబాబు రుణమాఫీ చేస్తానని అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. రైతులకు మీరేం చేశారో సమాధానం చెప్పాలి......జగనన్న ప్రభుత్వం ప్రజల పక్షపాత ప్రభుత్వం.రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం.ప్రతీ గ్రామంలో హెల్త్ క్లినిక్ లు పెట్టి వైద్యానికి పెద్దపీట వేశాం.రాష్ర్టానికి ఉన్న తీరప్రాంతంలోపోర్టులు, హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. 75 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేనంత సంక్షేమం జగన్ అందిస్తున్నారు.జగన్ సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పారు.జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు.రాష్ట్రాన్ని నాశనం చేసింది చంద్రబాబే.మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నాడు. మీకు మంచి చేస్తేనే ఓటేయండని దమ్ముగా జగన్ ప్రజలను అడుగుతున్నారు. నవరత్నాలు అమలు చేసినందుకు జగన్ నయవంచకుడని అంటావా.....చంద్రబాబే నయవంచకుడు.నేడు పక్క రాష్ట్రాలు కూడా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం గురించి మాట్లాడుకుంటున్నాయి.ప్రజలకు మంచి చేసిన జగన్ ను చూడలేకే రాళ్ల దాడి చేయించారని చంద్రబాబును విమర్శించారు.

Back to Top