విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పోలీసు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. - విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పై ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీలు ఎండి. రూహుల్లా, మొండితోక అరుణ్ కుమార్, జగ్గయ్యపేట ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ వైయస్ఆర్‌సీపీ నేతల భార్యలపై అగౌరవంగా వ్యాఖ్యలు చేసి కించపరిచారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసినా ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు. వైయస్ఆర్‌సీపీపై మాత్రం తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందని విమర్శించారు. పబ్లిక్‌గా మహిళలపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫిర్యాదు తీసుకోవడానికే భయపడుతున్నారా? తాము ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే, లేఖ తీసుకోవడానికే పోలీసులు వెనుకాడుతున్నారని దేవినేని అవినాష్ తప్పుపట్టారు. టీడీపీ నేతల ఒత్తిడికి పోలీసులు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. నిజంగా మహిళల గౌరవాన్ని కాపాడాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. - తిరుపతిలో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు తిరుపతి : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తిరుపతి ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి, ఏఎస్పీకి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదులు ఇచ్చినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తప్పుపట్టారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త మోహిత్, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్, గంగాధరనెల్లూరు సమన్వయకర్త కృపలక్ష్మి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. - విశాఖ పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైయస్ఆర్‌సీపీ నేతలు విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌ను కలిసి మరోసారి ఫిర్యాదు సమర్పించారు. ఈనెల 9వ తేదీన జరిగిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ కె.కె. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, సి.ఇ.సి సభ్యుడు కోలా గురువులు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రొంగలి జగన్నాధం, జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, పేడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. - కాకినాడలో ఎస్పీని కలిసిన వైయస్ఆర్‌సీపీ నేతలు ఏబీఎన్ రాధాకృష్ణపై ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, తుని నియోజకవర్గ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ, పిఠాపురం కోఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్, ప్రత్తిపాడు కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పెద్దాపురం కోఆర్డినేటర్ ధవళూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. - వైయస్ఆర్ జిల్లా ఎస్పీకి వైయస్ఆర్‌సీపీ నేతల వినతి ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు వైయస్ఆర్ కడప జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు కనీసం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టులకే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఉపేక్షించరాదని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. - పార్వతీపురం మన్యం, పాడేరు పోలీసు స్టేషన్లలో వైయస్ఆర్‌సీపీ నేతలు వినతి మహిళలను కించపరిచన ఏబీఎన్ రాధాకృష్ణపై ఇప్పటికే ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెండు ప్రాంతాల్లో పోలీస్ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటేశ్వర్లును కలిసి వైయస్ఆర్‌సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 9న ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, పాలకొండ వైస్ ఎంపీపీ కణపాక సూర్యప్రకాష్, జడ్పీటీసీ ప్రతినిధులు సవర రాము, సవర చంద్రశేఖర్, సవర సాయి కుమార్, కందుల వెంకట నాయుడు, మిడితాన కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. - పాడేరులో.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని కలిసి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యలింగం మాట్లాడుతూ, ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ నుంచి స్పందన లేకపోవడం ఆందోళనకరమన్నారు. మహిళలపై, ముఖ్యంగా ఆదివాసి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి మహిళలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆదివాసులు ఐక్యంగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పార్టీ పరిశీలకులు ఏరువాక సత్యరావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఎస్టీ సెల్ నాయకులు, మండల స్థాయి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. - ఏబీఎన్ రాధాకృష్ణపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఆంధ్రజ్యోతి (ఏబీఎన్) రాధాకృష్ణపై ఇప్పటికే గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మరోసారి గుంటూరు జిల్లా ఎస్పీని వైయస్ఆర్‌సీపీ నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు సమర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలపై ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి యేసు రత్నం, గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా, తెనాలి నియోజకవర్గ ఇంచార్జ్ అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ బలవజ్ర బాబు (డైమండ్ బాబు), ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ బలసాని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, చట్టం ముందు అందరూ సమానమని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. - కోనసీమ జిల్లా ఎస్పీకి వైయస్ఆర్‌సీపీ వినతి ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను కలిసి ఫిర్యాదు సమర్పించారు. పీ గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు, అంబాజీపేట–అయినవిల్లి మండల పార్టీ అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్, విత్తనాల ఇంద్రశేఖర్, మేడిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, తోరం భాస్కరరావు, దొమ్మేటి శివరాం, అడ్డగల సాయిరాం, ముల్లేటి త్రిమూర్తులు, నక్క వెంకటేశ్వరరావు, చాట్ల రామారావు, కుడుపూడి విద్యాసాగర్, బొంతు శ్రీనివాస్, దొమ్మేటి సత్యమోహన్, రాణి శ్రీధర్, తోరం గౌతమ్, కొంబత్తుల ఏసుబాబు, నూకపీయి రాజేంద్ర, యండ్రా ఏసుబాబు, దేవరపల్లి గౌతమ్, చప్పిడి పండు, చింత రాంబాబు, కోనే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.