నేడు అనంతపురం జిల్లా పామిడికి వైయ‌స్ జగన్

 
తాడేప‌ల్లి:
 వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించనున్నారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం. వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధు సూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళ వారం ఉదయం 11 గంటలకు పామి డిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైయ‌స్ జగన్ పాల్గొననున్నారు.  

Back to Top